ఐస్ క్యూబ్స్‌తో ఫేస్ ప్యాక్ వావ్ వాట్ ఏ రీఫ్రెష్‌మెంట్.!

- May 09, 2024 , by Maagulf
ఐస్ క్యూబ్స్‌తో ఫేస్ ప్యాక్ వావ్  వాట్ ఏ రీఫ్రెష్‌మెంట్.!

ఫేస్ ప్యాక్స్ అంటే ఆ క్రీములూ ఈ క్రీములూ అడ్డదిడ్డంగా పూసేయడమే కాదండోయ్. కూల్ కూల్‌గా ఐస్ ముక్కలతోనూ ఫేషియల్ చేసుకోవచ్చు.

ఇలా చేయడం వల్ల ముఖ్యంగా సమ్మర్‌లో ఈ ఐస్ ప్యాక్ ముఖానికి మంచి మసాజ్‌లా వుంటుంది. ఫేస్‌లో అలసట పోయి కాంతివంతంగా తాజాగా కనిపిస్తుంది.

అసలింతకీ ఏంటీ ఐస్ ప్యాక్.? ఐస్ క్యూబ్స్‌తో ముఖాన్ని సున్నితంగా మసాజ్ చేసుకోవడమే. లేదంటే, ఓ గిన్నెలో కాస్త కూల్ వాటర్ పోసి, అందులోనే కొన్ని ఐస్ క్యూబ్స్ వుంచి దాంట్లో ఫేస్ మునిగేలా వుంచాలి.

కొన్ని రకాల స్కిన్ టోన్ వారికి ఎక్కువ కూలింగ్ పడదు. అలాంటి వారు కొన్ని ఐస్ క్యూబ్స్‌ని ఓ గుడ్డలో చుట్టి ముఖంపై మెల్ల మెల్లగా ఒత్తుతూ వుంచాలి. కళ్లు మూసుకుని కాసేపు రిలాక్స్ అవుతుండాలి.

ఇలా చేయడం వల్ల ముఖం ఫ్రెష్‌గా కనిపించడమే కాదు, ముఖంపై వుండే మొటిమలు సైతం తొలిగిపోతాయ్. అలాగే జిడ్డు చర్మం వున్నవారికి కూడా ఈ ఐస్ ప్యాక్ చాలా మంచి చేస్తుంది. లెట్స్ ట్రై దిస్ వన్స్.!

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com