కమల్ హాసన్‌కి మళ్లీ దెబ్బ పడిందే.!
- May 09, 2024
విశ్వ నటుడు కమల్ హాసన్ నటించిన సినిమాలకు ఎంత క్రేజ్ వుందో, ఆయన సినిమాలు రిలీజ్ చేయడం అంతే కష్టం. రకరకాల కారణాలతో ఆయన సినిమాలు అనుకున్న డేట్‌కి అస్సలు రిలీజ్ కావు.
తాజాగా కమల్ హాసన్ నటిస్తున్న సినిమా ‘ఇండియన్ 2’. ఈ సినిమాని కొన్ని ఏళ్ల తరబడి తెరకెక్కిస్తూ వస్తున్నారు. మధ్యలో అనూహ్య సంఘటనల కారణంగా సినిమా షూటింగ్ చాలా నెలలు వాయిదా వేసేశారు కూడా.
ఎట్టకేలకు సినిమా మళ్లీ స్టార్ట్ కావడం, పూర్తవ్వడం రిలీజ్ డేట్ కూడా ఫిక్స్ చేసుకోవడం జరిగింది. జూన్ 15న సినిమా రిలీజ్ కావల్సి వుంది. కమల్ ఫ్యాన్స్ అంతా హ్యాపీ ఫీలయ్యారు.
కానీ, ఇంతలోనే సినిమా పోస్ట్ పోన్ అయ్యిందన్న ప్రచారం. జూన్ కాదట జూలై అంటున్నారు. పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి కాకపోవడమే అందుకు కారణం అంటున్నారు.
కారణం ఏదైతేనేమి.! ఈ సినిమా మళ్లీ వాయిదా పడుతుందన్న ప్రచారం కమల్ హాసన్ ఫ్యాన్స్‌ని కలవర పెడుతోంది. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో పలువురు హేమా హేమీ నటీ నటులు నటిస్తున్నారు. అన్నింటికీ మించి కమల్ హాసన్ కెరీర్‌లో బిగ్గెస్ట్ సెన్సేషన్ అయిన ‘ఇండియన్’ సినిమాకి సీక్వెల్‌గా వస్తున్న చిత్రమిది.
తాజా వార్తలు
- తెలంగాణ సచివాలయంలో తప్పిన ప్రమాదం..
- ఇమ్మిగ్రేషన్ నిబంధనలు కఠినతరం: అతిక్రమిస్తే జరిమానా, జైలు శిక్ష
- షిర్డీ సాయి సేవలో రష్మిక, విక్కీ కౌశల్
- మూడో వన్డేలో ఇంగ్లాండ్ పై ఘన విజయం
- యూఏఈలో రమదాన్ : పవిత్ర మాసానికి ముందు భారీ డిస్కౌంట్లు..!!
- అబ్షర్ లో కొత్త సేవ.. దత్తత కుటుంబ సభ్యునికి పాస్‌పోర్ట్ జారీ..!!
- పోలీస్ అధికారిపై దాడి..అరబ్ మహిళకు ఏడాది జైలుశిక్ష..!!
- యూఏఈలో 20 మంది పర్యావరణవేత్తలకు బ్లూ వీసా ప్రదానం..!!
- కువైట్‌లో కీటకాలు కలిగిన ఆహార ఉత్పత్తులకు చోటు లేదు..!!
- సౌత్ అల్ బతినాలో ఓపెన్-ఎయిర్ సినిమా, ఎకో-టూరిజం హబ్..!!