నోటిలో అల్సర్లకు ఉపశమనం ఎలా.?

- May 09, 2024 , by Maagulf
నోటిలో అల్సర్లకు ఉపశమనం ఎలా.?

కొందరిలో విటమిన్ల లోపం వల్ల నోటిలో అల్సర్లు వస్తుంటాయ్. అలాగే శరీరంలో ఓవర్ హీట్ వల్ల కూడా ఈ అల్సర్లు వస్తుంటాయ్. నాలుకపైనా లేదా లోపలి పెదవిలో.. ఇలా నోటి లోపల ఎర్రటి పుండులా వచ్చి విపరీతమైన బాధ పుట్టించే నోటి అల్సర్లకు ఇంటి చిట్కాలు తెలుసుకుందాం.

విటమిన్ ‘బి’ ట్యాబ్లెట్లు వాడడం ద్వారా కొంత మేర ఉపశమనం వుంటుంది కానీ, మూడు నుంచి నాలుగు రోజులు, కొందరిలో అయితే దాదాపు ఆరు నుంచి ఏడు రోజులు ఈ నోటి పుండ్లు బాధిస్తుంటాయ్.

ఇలాంటి టైమ్‌లో కొన్ని వంటింటి చిట్కాలు కాస్త ఉపశమనం ఇస్తుంటాయ్. పసుపులోని యాంటి బయోటిక్ గుణాలు ఈ ఇన్ఫెక్షన్‌ని కొంత తగ్గిస్తాయ్. పసుపుతో ఆ పుండును నొక్కి పెట్టి వుంచడం వల్ల కొంత ఉపశమనం వుంటుంది.

అలాగే, ఉప్పు కలిపిన వాటర్‌ని పుక్కిలించడం వల్ల కూడా కొంత పలితం వుంటుంది. అలాగే కొబ్బరి నూనెలో యాంటీ బయో లక్షణాలు ఈ నోటి పుండ్లను తగ్గిస్తాయ్.

పెరటిలో దొరికే అలోవెరా అనేక ఇన్ఫెక్షన్లకు మందుగా పని చేస్తుంది. అలాగే, ఈ నోటి పుండ్లకు కూడా. కాస్త అలోవెరా జెల్‌ని తాజాగా తీసి నోటిలో పుండు వున్న చోట పెట్టి నొక్కి పెట్టి వుంచితే, పుండు చుట్లూ వుండే ఇన్ఫెక్షన్ తగ్గుతుంది. చిన్న చేమంతి పూలు ఈ అల్సర్లను తగ్గించే శక్తిని కలిగి వుంటాయని ఓ సర్వేలో తేలింది.

చిన్న చామంతి పూలను రాత్రంతా నీటిలో నానబెట్టి ఆ వాటర్‌తో ఉదయం పుక్కిలిస్తే ఇన్ఫెక్షన్ త్వరగా తగ్గుతుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com