రౌడీ స్టార్
- May 09, 2024ఒకప్పుడు తన సినిమాను రిలీజ్ చేసేందుకు సపోర్ట్ కోసం వెతుకుతూ ఇబ్బందులు పడిన యంగ్ హీరో ..ఇవాళ తన సినిమాలను గ్రాండ్ గా పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ కు తీసుకొస్తున్నాడు. తెలుగుతో పాటు భాషలకు అతీతంగా తమిళ, కన్నడ, మలయాళ, హిందీ ప్రేక్షకుల్ని మెప్పిస్తూ వారి అభిమానం పొందుతున్నాడు. ఆ యంగ్ హీరో సాగిస్తున్న ఈ జర్నీ యువతరాన్ని బాగా ఇన్స్ పైర్ చేస్తోంది. ఇండస్ట్రీలోకి రావాలనుకున్న కొత్త వాళ్లు తమకూ ఆ హీరో లాంటి ఒక మంచి కెరీర్ ఉంటుందనే హోప్స్ పెట్టుకుంటున్నారు. అలా సినీ ఇండస్ట్రీలో తన సక్సెస్ తో చాలా మందికి రోల్ మోడల్ అయ్యాడు రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ. ఈరోజు విజయ్ దేవరకొండ బర్త్ డే.
విజయ్ దేవరకొండ అలియాస్ విజయ్ సాయి దేవరకొండ 1989, మే 9వ తేదీన హైదరాబాద్ లో జన్మించాడు. విజయ్ తండ్రి గోవర్ధనరావు నటన మీద ఆసక్తితో హైదరాబాద్ చేరుకొని నటుడిగా అవకాశాల కోసం ప్రయత్నాలు చేసినా, అవకాశాలు రాకపోవడంతో దర్శకత్వ శాఖ వైపు అడుగులు వేసి దూరదర్శన్ మొదలుకొని పలు టీవీ చానళ్ళలో సీరియల్స్ కు దర్శకత్వం వహించారు. తండ్రి లాగే సినిమాల పట్ల ఆసక్తి పెంచుకున్న విజయ్ డిగ్రీ పూర్తి చేసిన తర్వాత పలు నాటకాల్లో నటించాడు.
విజయ్ దేవరకొండ మొదట్లో అవకాశాల కోసం చాలా స్టూడియోల చుట్టూ దర్శక నిర్మాతల చుట్టూ తిరిగాడు. ఫ్యామిలీ సపోర్ట్ బాగానే ఉన్నప్పటికీ తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు అందుకున్నాడు. నటుడిగా తనను తాను సరికొత్తగా ప్రజెంట్ చేసుకోవాలి అని అతను చేసిన హార్డ్ వర్క్ ప్రతీ సినిమాలో కనిపించింది.
దర్శకుడు రవిబాబు దర్శకత్వంలో వచ్చిన నువ్విలా చిత్రం, శేఖర్ కమ్ముల తీసిన లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ చిత్రాల్లో చిన్న పాత్రల్లో విజయ్ నటించాడు. 2015లో నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వచ్చిన ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాలో హీరో నానితో కలసి నటించాడు. ఎవడే సుబ్రహ్మణ్యం సినిమా చూస్తున్నవాళ్లకు విజయ్ దేవరకొండ ఎవరో తెలియదు. రిషి క్యారెక్టర్ లో ఎంతో సహజంగా, ఈజ్ తో నటిస్తున్న అతన్ని చూసి ప్రేక్షకులు ఇంప్రెస్ అయ్యారు.
2016లో తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన పెళ్లి చూపులు సినిమాతో హీరోగా విజయ్ దేవరకొండ ప్రతిభ అందరికీ తెలిసింది. 2017 లో దర్శకుడు సందీప్ రెడ్డి వంగా రూపొందించిన మాస్టర్ పీస్ అర్జున్ రెడ్డి విజయ్ కెరీర్ కు ఒక బెంచ్ మార్క్ మూవీ అయ్యింది. ఈ సినిమా ప్రమోషన్ లో విజయ్ కాన్ఫిడెన్స్ చూసి ఇండస్ట్రీ సర్ ప్రైజ్ అయ్యింది. అర్జున్ రెడ్డి క్రియేట్ చేసిన సెన్సేషన్, ఆ సినిమాలో డాక్టర్ అర్జున్ గా విజయ్ పర్ ఫార్మెన్స్ చూసి బీ, సీ సెంటర్స్ ఆడియెన్స్ నుంచి సెలబ్రిటీల దాకా విజయ్ ఫ్యాన్స్ అయ్యారు.
టాక్సీవాలా విజయ్ కు మరో సూపర్ హిట్ ఇస్తే..గీత గోవిందం ఆయన కెరీర్ లో ఫస్ట్ హండ్రెడ్ క్రోర్ మూవీగా నిలిచింది. హోల్ సమ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన గీత గోవిందం విజయ్ కెరీర్ లో మరో స్పెషల్ మూవీగా నిలిచింది. ఖుషి, ఫ్యామిలీ స్టార్ సినిమాలు విజయ్ దేవరకొండను సకుటుంబ ప్రేక్షకుల దగ్గరకు మరింతగా చేర్చాయి. సినిమా మీద ప్యాషన్, నటన మీద ప్రేమ, హీరోగా విజయ్ చూపించే డెడికేషన్ అందరినీ ఆకట్టుకుంటుంది.
విజయ్ దేవరకొండ స్టార్ గా ఎదగడమే కాదు సొసైటీ పట్ల తన బాధ్యతను ఎప్పుడూ మర్చిపోలేదు . కరోనా టైమ్ లో దేవరకొండ ఫౌండేషన్ ద్వారా మిడిల్ క్లాస్ ఫండ్ ఏర్పాటు చేసి, పేద మధ్య తరగతి కుటుంబాలకు నిత్యావసర వస్తువులు, ఇతర సహాయం అందించాడు. యువతకు ఉపాధి కోసం ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ చేశాడు. దేవరశాంట పేరుతో ఏటా తన ఫ్యాన్స్ లో కొందరిని టూర్స్ పంపిస్తుంటాడు. తన పుట్టిన రోజున నగరంలోని వివిధ ప్రాంతాలలో ఐస్ క్రీం ట్రక్స్ ఏర్పాటు చేయిస్తాడు విజయ్. ఖుషి సినిమా టైమ్ లో ప్రేక్షకుల్లో వందమందిని సెలెక్ట్ చేసి వారి కుటుంబాలకు లక్ష రూపాయల చొప్పున కోటి రూపాయల సాయం అందించాడు. ఇలా మంచి మనసున్న హీరోగా విజయ్ దేవరకొండ పేరు తెచ్చుకుంటున్నాడు.
ప్రస్తుతం విజయ్ దేవరకొండ కథానాయకుడిగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్‌తో కలిసి ఓ చిత్రాన్ని రూపొందిస్తోంది. విజయ్ దేవరకొండ కెరీర్ లో 12వ సినిమాగా తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని శ్రీకర స్టూడియోస్ సమర్పణలో ఎస్. నాగ వంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
--డి.వి.అరవింద్(మాగల్ఫ్ ప్రతినిధి)
తాజా వార్తలు
- తెలంగాణలో నేటి నుంచి ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక
- భారీ భూకంపంతో కాలిఫోర్నియాలో సునామీ హెచ్చరికలు
- చికాగోలో NATS ఆధ్వర్యంలో దీపావళి వేడుకలు
- అవిశ్వాస తీర్మానంలో ఓడిన ఫ్రాన్స్ ప్రధాని బార్నియర్
- అల్లు అర్జున్ పై కేసు నమోదు చేసి సమన్లు జారీ చేసిన పోలీసులు
- యూఏఈలో కార్ వాష్ రూల్స్: మురికి వాహనాలపై Dh3,000 వరకు ఫైన్..!!
- విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్
- చమురు ఉత్పత్తి కోతలను 3 నెలలు పొడిగించిన ఒపెక్ దేశాలు..!!
- 'దుక్మ్-1' రాకెట్‌ను విజయవంతంగా ప్రయోగించిన ఒమన్..!!
- బహ్రెయిన్ ఫెస్టివిటీస్ 2024..12 క్రూయిజ్ షిప్‌లకు స్వాగతం..!!