పిఠాపురంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.!
- May 11, 2024
ఓ పక్క హాలీడేస్ సీజన్. మరో పక్క ఐపీఎల్ సందడి. హాలీడేస్‌లో రిలీజ్ అయ్యే కొత్త సినిమాలు.. బాక్సాఫీస్ సందడి సందడిగా వుండి వుండాలి. కానీ, సినిమా లేదు, ఐపీఎల్ లేదు.. అంతా ఒక్కటే పాలిటిక్స్.. అన్న చందంగా మారింది పరిస్థితి.
అంత కిక్కిస్తున్నాయ్ ముఖ్యంగా ఏపీలో పాలిటిక్స్. అందుకు కారణం జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ఆయనకు సపోర్ట్‌గా సినీ లోకం అంతా దిగొచ్చింది. తమ సపోర్ట్ అందిస్తోంది.
మెగా హీరోలు సినిమాలూ, షూటింగులు బంద్ పెట్టి పొలిటికల్ ప్రచారంలో బిజీగా వున్నారు. మెగా హీరోలే కాదు, పలువురు సినీ ప్రముఖులు కూడా.
పొలిటికల్ ప్రచారంలో నిమగ్నమైన వాళ్లు కొందరైతే, సర్వేల నిమిత్తం ఆంధ్ర ప్రదేశ్‌లో తిరుగుతున్న వారు ఇంకొందరు.
ఇలా ఎటు చూసినా రాజకీయ రంగు పులుముకుంది సినీ ఇండస్ట్రీ అంతా. తాజాగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా పొలిటికల్ ప్రచారంలో పాల్గొనేందుకు సంసిద్ధమయ్యారు.
బాబాయ్ పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న పిఠాపురం సంస్థానంలో ప్రచారం నిమిత్తం ల్యాండ్ అయ్యారు.
ఆయన సినిమాల విషయానికి వస్తే, బుచ్చిబాబు సనతో ఓ సినిమా చేస్తున్నాడు. శంకర్ దర్శకత్వంలోని ‘గేమ్ ఛేంజర్’ సినిమా పూర్తి చేయాల్సి వుంది. ఏది ఏమైనా మే 15 ఎలక్షన్స్ తర్వాతే ఏ షూటింగ్ అయినా.. ఏ సినిమా అప్డేట్ అయినా.! అదీ సంగతి.
తాజా వార్తలు
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు
- టీటీడీకి రూ.10 లక్షలు విరాళం
- ఛార్జీల సవరణ ‘దసరా స్పెషల్స్’లోనే స్పష్టం
- దుబాయ్ లో నకిలీ హోటల్ ఫ్లోర్ లీజు..ఇద్దరికి జైలు శిక్ష..!!
- అల్-ముత్లా యాక్సిడెండ్, ఎమర్జెన్సీ సెంటర్ ప్రారంభం..!!
- మహిళకు జీవిత ఖైదు విధించిన బహ్రెయిన్ కోర్టు..!!
- 10 కిలోల మెత్ సీజ్ చేసిన సౌదీ కస్టమ్స్..!!
- ఒమన్‌లో ఐఫోన్ 17 సందడి..!!