నకిలీ వార్తల భరతం పడుతున్న లాజికల్లీ
- May 14, 2024
ప్రపంచవ్యాప్తంగా డిజిటల్ మీడియా ఉచ్చ స్థితిలో ఉన్న ఈ సమయంలో మంచి ఎంత జరుగుతుందో చెడు సైతం కూడా అంతే జరుగుతుంది. ఇంక వార్తల విషయానికి వచ్చేసరికి ఏది నమ్మాలో, ఏది నమ్మకూడదో తెలియని పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా కరోనా సమయంలో లెక్కలేనన్ని నకిలీ వార్తలు విపరీతంగా వ్యాపించాయన్నది వాస్తవం.
అయితే ఈ వార్తల్లో నిజమైనవేవో నిగ్గు తేల్చి సామాజిక బాధ్యతను నిర్వర్తించినందుకు నిజ నిర్ధారణ (Fact Checking) వార్తల విభాగంలో అనేక బహుమతులు పొందింది లాజికల్లీ (Logically)యాప్. ఈ ఔత్సాహిక అంకురాన్ని పెట్టింది లిరిక్ జైన్ అనే యువ వ్యాపారవేత్త. 2014 దేశ సార్వత్రిక ఎన్నికల సమయంలో సామాజిక మాధ్యమాల్లో విచ్చలవిడిగా వచ్చిన నకిలీ వార్తల గుట్టురట్టు చేయాలని భావించి 2016లో "లాజికల్లీ" సంస్థను స్థాపించాడు.
మానవ మేధస్సు కు సాంకేతికంగా అభివృద్ధి చెందిన కృత్రిమ మేధస్సు ను జతచేసి నకీల వార్తల పని పడుతున్నాడు. పలు రంగాల్లో నిష్టణుతులైన చాలా మంది నిపుణులు ఈ సంస్థ లో పనిచేస్తున్నారు. ఎన్నికల సమయంలో పలు రాష్ట్రాల ఎన్నికల సంఘాలతో , అక్కడి పోలీసు విభాగాలతో "లాజికల్లీ" కలిసి పనిచేస్తుంది. పోయిన సంవత్సరం జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో సైతం నకిలీ వార్తలను అరికట్టేందుకు ఈ యాప్ ను అక్కడ బాగా ఉపయోగించారు అని సంస్థ వ్యవస్థాపకుడు లిరిక్ జైన్ తెలియజేశారు.
ప్రస్తుతం ఇంగ్లీష్ , హిందీ , మరాఠీ మరియు కన్నడ భాషల్లో మాత్రమే సేవాలందిస్తున్న లాజికల్లీ సంస్థ రానున్న రోజుల్లో దేశంలో ఉన్న ప్రాంతీయ భాషలన్నిట్లోనూ అందుబాటులోకి తెచ్చేందుకు సంస్థ ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. అంతేకాకుండా త్వరలో ఈ యాప్ ప్రత్యేకంగా వాట్సప్ నంబర్ తెచ్చే ప్రయత్నాల్లో కూడా ఉందని సమాచారం. వాట్సప్ లో ఆ నంబర్ అందుబాటులోకి వచ్చిన తర్వాత ఎవరైనా తమకు అనుమానం ఉన్న వార్తని ఆ నంబరుకి పంపిస్తే కృత్రిమ మేధా ద్వారా అది నిజమో కాదో చెప్పేస్తుంది. ఒక వేళ నకిలీ వార్త అయితే దాని పుట్టుపూర్వత్రలతో సహా తెలిసిపోతుందట.
భారతదేశంలో రూపొందించిన ఈ మెడిన్ ఇండియా యాప్ కు భారత ప్రభుత్వం నిర్వహించిన ఆత్మనిర్భర్ భారత్ పోటీల్లో ప్రథమ బహుమతి సైతం లభించింది. ప్రపంచ వ్యాప్తంగా ఈ యాప్ కు బహుళ ఆదరణ లభించాలని సంస్థ ధ్యేయంగా పెట్టుకుంది.ప్రజలకు "లాజికల్లీ" యాప్ ద్వారా నిజమైన సమాచారాన్ని నిరంతరం అందించేందుకు తన వంతు కృషి ఎల్లప్పుడూ ఉంటుంది అని సంస్థ వ్యవస్థాపకుడు లిరిక్ జైన్ స్పష్టం చేస్తున్నారు.
--డి.వి.అరవింద్(మాగల్ఫ్ ప్రతినిధి)
తాజా వార్తలు
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్‌లో అస్సాం రైఫిల్స్‌పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!