‘సలార్ 2’ లో కూడా ప్రబాస్ పరిస్థితి అంతేనా.?
- May 14, 2024
ప్రబాస్ నటించిన సినిమాలేమీ ఈ మధ్య బాక్సాఫీస్ వద్ద కలిసి రావడం లేదు. అలాంటిది ‘సలార్’ సినిమా కాస్త ఊపిచ్చింది. ప్రబాస్‌పై ప్రశాంత్ నీల్ ఇచ్చిన ఎలివేషన్లు సినిమాని హిట్ రేస్‌లో వుంచాయని చెప్పొచ్చేమో.
అయితే, ఈ సినిమా కోసం ప్రబాస్ కష్టపడిందేమీ లేదని తాజాగా తెలిసింది. మరీ చిత్రమైన అంశమేంటంటే, సినిమాకి హీరో అంటే సినిమాలో ముప్పావు వంతు హీరోనే కనిపిస్తుండాలి. వినిపిస్తుండాలి. అలాంటిది ‘సలార్ 1’లో ప్రబాస్ కనిపించింది కేవలం మూడు నిమిషాలేనట. మాట్లాడింది 2.33 నిమిషాలని తేల్చారు.
ఇది తెలిసి అంతా అవాక్కవుతున్నారు. ప్రశాంత్ నీల్ని ఆడిపోసుకుంటున్నారు. రెండో పార్ట్‌లో కూడా ప్రబాస్‌ని అలాగే చూపిస్తాడా.? డైలాగులు అలాగే రాస్తాడా.? అని క్వశ్చన్ చేస్తున్నారు.
కానీ, ఇది నిజంగా దారుణం. ఇకపోతే, ‘సలార్ 2’ని శౌర్యంగ పర్వం అనే కాన్సెప్ట్‌తో సిద్దం చేస్తున్నారు ప్రశాంత్ నీల్. ఈ పర్వంలో ప్రబాస్ పాత్ర, పాత్ర తాలూకు ప్రాధాన్యత మొదటి పార్ట్‌కి మించి వుంటేనే ప్రేక్షకులు, ముఖ్యంగా అభిమానులు శాటిస్ఫై అయ్యే పరిస్థితి కనిపిస్తోంది. చూడాలి మరి, ప్రశాంత్ నీల్ ఏం చేస్తాడో.!
తాజా వార్తలు
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్‌లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి







