పవన్ కళ్యాణ్ ఇకపై కాస్త అటు ఫోకస్ పెడతాడా.?
- May 14, 2024
ఎలక్షన్స్ హీట్‌తో తడిసి ముద్దయ్యాడు పవన్ కళ్యాణ్ ఇంతవరకూ. ఎలక్షన్స్ పేరు చెప్పి చాలా చాలా కష్టపడ్డాడు. జనం కోసం జనంతో అహర్నిశలు మమేకమయ్యాడు. కోట్లు కొల్లగొట్టే సినిమాలను సైతం పక్కన పెట్టేశాడు.
ఎలక్షన్లు ముగిసిపోయాయ్. రిజల్ట్‌కి ఇంకాస్త టైముంది. ఈ టైమ్‌లో కాస్త టైమ్‌ని విశ్రాంతి కోసం వాడుకుని, మరికొంత టైమ్‌ని సినిమాల కోసం కేటాయించాలనుకుంటున్నాడనీ ఇన్సైడ్ గుస గుస.
పవన్ కళ్యాణ్ నుంచి రాబోయే సినిమాల్లో సగం సగం షూటింగ్ పూర్తి చేసుకున్న సినిమాలు ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఒకటి, ‘ఓజీ’ ఇంకోటి.. ‘హరి హర వీరమల్లు’ మరోటి. ఈ మూడు చిత్రాలను తనవంతుగా పూర్తి చేసే పని పెట్టుకున్నాడని ప్రచారం జరుగుతోంది.
అలా చేస్తే ఈ సినిమాలు ఈ ఏడాదే ప్రేక్షకుల ముందుకొచ్చే అవకాశాలు లేకపోలేదు. అన్నీ కలిసొచ్చి ఎలక్షన్లలోనూ విజయం సాధిస్తే.. ఓ వైపు రాజకీయాలూ, మరో వైపు సినిమాలూ.. పవన్ కళ్యాణ్ తన అభిమానులకి డబుల్ పండుగే.!
తాజా వార్తలు
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్‌లో అస్సాం రైఫిల్స్‌పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!