పేటీఎం లైట్ వ్యాలెట్ రోజువారీ లిమిట్ పెరిగిందోచ్..
- May 14, 2024
పేటీఎంలో రోజువారీ చిన్నమొత్తంలో లావాదేవీలకు వ్యాలెట్లను ఇష్టపడే యూజర్ల కోసం యూపీఐ లైట్ వ్యాలెట్‌పై దృష్టిసారించింది. ఈ కొత్త యూపీఐ లైట్ మీ ఫోన్‌లో వ్యాలెట్‌గా పనిచేస్తుంది. వినియోగదారులు ఎలాంటి పిన్ అవసరం లేకుండానే డబ్బును స్టోర్ చేయడం లేదా పేమెంట్లను వేగంగా చేసేందుకు వీలు కల్పిస్తుంది. యూపీఐ లైట్ వ్యాలెట్ వేగవంతమైన సురక్షితమైన లావాదేవీలను అందిస్తుంది. వినియోగదారులను రూ. 500 వరకు ఫెయిల్ ప్రూఫ్ పేమెంట్లను చేసేందుకు అనుమతిస్తుంది.
రోజుకు రెండు సార్లు.. పిన్ లేకుండానే:
కిరాణా సామాగ్రిని కొనుగోలు చేయడం,పార్కింగ్ కోసం చెల్లించడం లేదా రోజువారీ ప్రయాణ ఛార్జీలను కవర్ చేయడం వంటి చిన్న పేమెంట్లు చేసేవారికి ఈ ఫీచర్ ప్రయోజనకరంగా ఉంటుంది. అదనంగా, పేమెంట్ల సంఖ్యతో సంబంధం లేకుండా అన్ని లావాదేవీలను ఒకే ఎంట్రీతో బ్యాంక్ స్టేట్‌మెంట్‌లను పొందవచ్చు. వినియోగదారులు యూపీఐ లైట్ వ్యాలెట్ రోజుకు రెండుసార్లు గరిష్టంగా రూ. 2వేల వరకు యాడ్ చేయొచ్చు. మొత్తం రోజువారీ లిమిట్ రూ.4వేలు ఉంటుంది. యూజర్లకు రోజువారీ పేమెంట్లను పిన్ లేకుండానే ఈజీగా చేసుకోవచ్చు.
పేటీఎం యాప్‌లో సులభంగా యూపీఐ లైట్ పేమెంట్లు:
- పేటీఎం యాప్‌ని ఓపెన్ చేసి.. హోమ్‌పేజీలో ‘యూపీఐ లైట్ యాక్టివేట్’ ఐకాన్‌పై క్లిక్ చేయండి.
- యూపీఐ లైట్‌తో లింక్ చేసేందుకు కావలసిన బ్యాంక్ అకౌంట్లను ఎంచుకోండి.
- పేమెంట్లను ఎనేబుల్ చేసేందుకు యూపీఐ లైట్‌కి యాడ్ చేసే అవసరమైన మొత్తాన్ని ఎంటర్ చేయండి.
- మీ యూపీఐ లైట్ అకౌంట్ క్రియేట్ చేసేందుకు MPINని ధృవీకరించండి.
- మీ యూపీఐ లైట్ అకౌంట్ ఇప్పుడు సులభమైనది. సింగిల్-ట్యాప్ పేమెంట్ల కోసం సెటప్ అయింది.
- యూపీఐ లైట్ వ్యాలెట్ ఉపయోగించి పేమెంట్లు చేయడానికి వినియోగదారులు ఏదైనా యూపీఐ క్యూఆర్ కోడ్‌ని స్కాన్ చేయవచ్చు. మొబైల్ నంబర్‌ను రిజిస్టర్ చేయవచ్చు లేదా వారి జాబితా నుంచి కాంటాక్టులను ఎంచుకోవచ్చు. యాక్సిస్ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ), యశ్ బ్యాంక్ వంటి ప్రముఖ పేమెంట్ సిస్టమ్ ప్రొవైడర్‌లతో (పీఎస్‌పీ) పేటీఎం సహకారంతో యూపీఐ లావాదేవీలకు ఫ్రేమ్‌వర్క్‌ని అందిస్తుంది.
- పేటీఎం యూపీఐ లైట్ ఏదైనా దూర ప్రయాణాల్లో వేగంగా పేమెంట్లు చేసుకోవచ్చు. బ్యాంక్ స్టేట్‌మెంట్‌లతో పాటు స్థానిక దుకాణాలు, స్ట్రీట్ మర్చంట్స్, సాధారణ కొనుగోళ్లలో వేగవంతమైన లావాదేవీలను అనుమతిస్తుంది. భారత్‌లోని ప్రతి మూలలో ఎన్‌పీసీఐ సహకారంతో యూపీఐ పర్యావరణ వ్యవస్థను విస్తరించడానికి కంపెనీ కట్టుబడి ఉందని ప్రతినిధి ఒకరు తెలిపారు.
తాజా వార్తలు
- త్వరలో వెబ్‌లో గ్రూప్ వీడియో, ఆడియో కాల్స్ సౌకర్యం
- దావోస్ కు బయల్దేరిన చంద్రబాబు, రేవంత్ రెడ్డి
- స్పెయిన్ లో ఘోర రైలు ప్రమాదం.. 21 మంది మృతి
- ఎన్ఆర్ఐ టీడీపీ బహ్రెయిన్ ఆధ్వర్యంలో ఎన్టిఆర్ 30వ వర్ధంతి
- అవాలి అభివృద్ధి మాస్టర్ ప్లాన్ పై కింగ్ హమద్ సమీక్ష..!!
- యూఏఈ దిర్హమ్కు రూ.25కు చేరువలో భారత రూపాయి..!!
- విదేశీ వాహనదారులకు ఖతార్ గుడ్ న్యూస్..!!
- రియాద్ లో దక్షిణ యెమెన్ నాయకులు..కీలక ప్రకటన..!!
- కువైట్ ‘లులు’లో బ్రిటిష్ డెయిరీ ప్రొడక్ట్స్ వీక్..!!
- ఒమన్‌లో 8.5% పెరిగిన బ్యాంకు లోన్లు..!!







