వారంలో 450,000 మంది ప్రజలు రఫా నుండి తరలిపోయారు.. UN

- May 15, 2024 , by Maagulf
వారంలో 450,000 మంది ప్రజలు రఫా నుండి తరలిపోయారు.. UN

గాజా: ఇజ్రాయెల్ ట్యాంకులు దక్షిణ గాజా నగరంలోకి దూసుకొస్తున్న నేపథ్యంలో గత వారంలో దాదాపు 450,000 మంది పాలస్తీనియన్లు రఫా నుండి తరలిపోయారని UN తెలిపింది. ప్రజలు నిరంతరం అలసట, ఆకలి మరియు భయాన్ని ఎదుర్కొంతు టున్నారని అని పాలస్తీనా శరణార్థుల కోసం పనిచేస్తున్న UN ఏజెన్సీ ప్రతినిధి అన్ర్వా హెచ్చరించారు. ఇజ్రాయెల్ సైన్యం నగరం యొక్క తూర్పు ప్రాంతంలో "ఉగ్రవాద లక్ష్యాలకు వ్యతిరేకంగా కార్యకలాపాలు" కొనసాగిస్తున్నట్లు చెప్పారు. ఇక్కడ మిలియన్ కంటే ఎక్కువ మంది ప్రజలు ఆశ్రయం పొందారు. ఉత్తర గాజాలో కొత్త ఇజ్రాయెల్ కార్యకలాపాలు మరో 100,000 మందిని తరిలేలా చేశాయి. ఇజ్రాయెల్ దళాలు దాడులను ప్రారంభించే ముందు తూర్పు రఫా,జబాలియా నుండి తమ భద్రత కోసం పౌరులు వెళ్ళాలని ఆదేశించింది. ఇప్పటి వరకు గాజాలో 35,170 మందికి పైగా మరణించారని హమాస్ ఆధ్వర్యంలోని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ క్రమంలో ఉన్ర్వా  ఇజ్రాయెల్ ఆపరేషన్ ప్రారంభానికి ముందు గుడారాలు మరియు తాత్కాలిక ఆశ్రయాలతో నిండిన రఫాలోని ఖాళీ వీధులను చూపించే అనేక ఫోటోలను పోస్ట్ చేశారు.  ఇజ్రాయెల్ ట్యాంకులు ఆగ్నేయ రఫాలోని నివాస ప్రాంతాలలోకి సాగుతున్నాయని మరియు ఈజిప్ట్‌తో సమీపంలోని రాఫా క్రాసింగ్‌కు ప్రధాన ఉత్తర-దక్షిణ రహదారిని దాటిందని, ఇజ్రాయెల్ దళాలు మంగళవారం దీనిని స్వాధీనం చేసుకున్నాయని తెలిపింది.  ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (IDF) గత వారం బ్రెజిల్, అల్-జెనీనా మరియు అనేక ఇతర తూర్పు పొరుగు ప్రాంతాలను ఖాళీ చేయమని నివాసితులను ఆదేశించింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com