డొనేషన్ క్యాంపెయిన్‌ని ప్రారంభించిన ఐటిఎ
- June 08, 2016
ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అథారిటీ (ఐటిఎ), వార్షిక రమదాన్ డొనేషన్ క్యాంపెయిన్‌ని ప్రారంభించింది. తమ వెబ్ పోర్టల్ ద్వారా ఎవరైనా డొనేషన్లు చేయవచ్చనీ, అది పేదలకు చేరుతుందని నిర్వాహకులు తెలిపారు. ద్విభాషా పోర్టల్‌ని అందరికీ అర్థమయ్యేలా రూపొందించామనీ, ఇది రిజిస్టర్ చేయబడిన చారిటబుల్ ఆర్గనైజేషన్ అనీ వారు తెలిపారు. ఒమన్ బ్యాంకుల్లో అక్కౌంట్లు కలిగినవారు ఎవరైనా ఈ వెబ్ పోర్టల్ ద్వారా డొనేషన్స్ చేయవచ్చు. దర్ అల్ అట్టా, ఒమన్ అసోసియేషన్ ఫర్ డిజేబుల్డ్, ఎన్విరాన్‌మెంట్ సొసైటీ ఆఫ్ ఒమన్, అసోసియేషన్ ఫర్ ది వెల్ఫేర్ ఆఫ్ హ్యాండిక్యాప్డ్, అల్ నూర్ అసోసియేషన్ ఫర్ ది బ్లైండ్, అసోసియేషన్ ఫర్ ఎర్లీ ఇంటర్వెన్షన్ ఫర్ చిల్డ్రన్ విత్ డిజేబిలిటీ, ఒమన్ క్యాన్సర్ అసోసియేషన్, ఒమన్ హెరిడేటరీ బ్లడ్ డిజార్డర్ అసోసియేషన్, అల్ రహమా చారిటీ టీమ్, హౌస్ ఆఫ్ ఫండ్స్ అండ్ జకా, ఒమనీ అసోసియేషన్ ఫర్ ఎల్డర్లీ ఫ్రెండ్స్, ఒమన్ డయాబెటిస్ అసోసియేషన్, ఒమనీ బహ్‌జాహ్ ఆర్ఫాన్ సొసైటీ, ఒమన్ ఛారిటబుల్ ఆర్గనైజేషన్ వంటి సంస్థలకు ఈ వెబ్‌సైట్ ద్వారా డొనేట్ చేయడానికి వీలుంది. ప్లే స్టోర్ లేదా యాప్ స్టోర్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకున్న యాప్ కూడా డొనేషన్లకు వీలు కల్పిస్తుంది. ఇప్పటివరకు 67,988 మంది 1.68 ఒమన్ రియాల్స్ ఒనేట్ చేశారు.
తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







