రమదాన్‌లో స్పోర్ట్ మజ్లిస్
- June 08, 2016
బహ్రెయిన్ ఒలింపిక్ కమిటీ (బిఓసి), స్పోర్ట్ మజ్లిస్‌ని రమదాన్‌లో నిర్వహించనుంది. జూన్ 12 నుంచి మూడు వారాలపాటు జరిగే ఈ కార్యక్రమంలో స్పోర్ట్స్ అసోసియేషన్స్‌కి చెందిన రిప్రెజెంటేటివ్స్, సంబంధిత అథారిటీలు, అడ్మినిస్ట్రేటర్స్, రిఫరీస్, అథ్లెట్స్ మరియు మీడియా పాల్గొనేందుకు అవకాశం ఉంది. వివిధ సంస్థల మధ్య పరస్పర అవగాహన ఒప్పందాలే లక్ష్యంగా బిఓసి ఈ స్పోర్ట్ మజ్లిస్‌ని ఏర్పాటు చేసింది. బిఓసి జనరల్ సెక్రెటరీ అబ్దుల్ రహ్మాన్ అస్కర్ మాట్లాడుతూ, బోర్డ్ మెంబర్స్‌తోపాటు, మజ్లిస్లోకి విజిటర్స్‌ని కూడా ఆహ్వానిస్తామనీ, స్పోర్ట్స్‌కి సంబంధించి ముఖ్యమైన అంశాల్ని ఇక్కడ చర్చించడానికి వీలుంటుందని తెలిపారు. స్పోర్ట్స్ క్లబ్‌కి సంబంధించి టాప్ ఫిగర్స్‌కి ఇప్పటికే ఇన్విటేషన్లు కూడా పంపామని ఆయన చెప్పారు. కొత్త ఆలోచనల్ని ఈ వేదికపై పంచుకోవడం ద్వారా స్పోర్ట్స్‌లో రాణించడానికి తగిన మార్గాల్ని అన్వేషించడానికి వీలవుతుందని తెలిపారాయన.
తాజా వార్తలు
- భారత్-న్యూజిలాండ్ మధ్య కుదిరిన ఫ్రీ ట్రేడ్ డీల్
- తిరుమలలో వైకుంఠద్వార దర్శనాలకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు
- జనవరి 2 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు
- వందే భారత్ స్లీపర్ రైలు ట్రయల్ సక్సెస్…
- చికాగోలో ఘనంగా చలనచిత్ర సంగీత కచేరీ
- సైనిక సిబ్బంది పై దాడి..ఇద్దరు వ్యక్తులు అరెస్ట్..!!
- మహిళా సాధికారత..ఉమెన్ ఇన్స్పైర్ సమ్మిట్..!!
- Dh100,000 చొప్పున గెలిచిన నలుగురు భారతీయులు..!!
- మస్కట్‌లో ఖైదీల ఉత్పత్తుల ప్రదర్శన పై ప్రశంసలు..!!
- ఖతార్‌లో విటమిన్ డి లోపం విస్తృతంగా ఉంది:స్టడీ







