అల్‌ తుమామా హెల్త్‌ సెంటర్‌ని ప్రారంభించిన హెల్త్‌ మినిస్టర్‌

- June 08, 2016 , by Maagulf
అల్‌ తుమామా హెల్త్‌ సెంటర్‌ని ప్రారంభించిన హెల్త్‌ మినిస్టర్‌



అల్‌ తుమామా హెల్త్‌ సెంటర్‌ని మినిస్టర్‌ ఆఫ్‌ పబ్లిక్‌ హెల్త్‌ డాక్టర్‌ హనన్‌ మొహమ్మద్‌ అల్‌కువారి ప్రారంభించారు. ప్రైమరీ హెల్త్‌ కేర్‌ కార్పొరేషన్‌ (పిహెచ్‌సిసి) మేనేజింగ్‌ డైరెక్టర్‌ మరియమ్‌ అబ్దుల్‌ మాలిక్‌ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పిహెచ్‌సిసి అధికారులు, మెడికల్‌ స్టాఫ్‌, పలువురు మున్సిపల్‌ కౌన్సిల్‌ మెంబర్స్‌ ఈ ప్రారంభోత్సవానికి హాజరయ్యారు. హెల్త్‌ సెంటర్‌లో ప్రతి విభాగాన్నీ పరిశీలించిన మినిస్టర్‌, అధికారులతో పలు అంశాలపై చర్చించి, అక్కడ అందే సౌకర్యాల గురించి తెలుసుకున్నారు. పబ్లిక్‌ క్లినిక్స్‌, వాక్సినేషన్‌ క్లినిక్స్‌, నాన్‌ కమ్యూనికబుల్‌ డిజీజెస్‌ క్లినిక్స్‌, లేబోరేటరీ, ఫార్మసీ, రేడియాలజీ, డెంటల్‌ క్లినిక్‌, మెడికల్‌ కమిషన్‌ని ఇందులో ఏర్పాటు చేశారు. ఆప్తల్మాలజీ, డెర్మటాలజీ, మెంటల్‌ హెల్త్‌ క్లినిక్‌ విభాగాలు కూడా ఉన్నాయి. అంతర్జాతీయ స్థాయిలో వైద్య సౌకర్యాలు అందేలా ఈ సెంటర్‌ని ఏర్పాటు చేసినట్లు డాక్టర్‌ అబ్దుల్‌ మాలిక్‌ తెలిపారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com