ఏపీ ఎన్నికల ఫలితాలపై రూ.కోట్లలో బెట్టింగ్‌లు
- May 16, 2024
అమరావతి: అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై రూ.కోట్లలో పందేలు జరుగుతున్నాయి. రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది? ఉమ్మడి జిల్లాలో ఏ పార్టీ ఎక్కువ సీట్లు సాధిస్తుంది? నియోజకవర్గంలో పోలింగ్ కేంద్రాల వారీగా ఏ పార్టీకి ఎంత లీడ్ వస్తుంది? అన్న అంశాలపై జోరుగా బెట్టింగ్‌లు సాగుతున్నాయి. కొంత మంది సర్వే నివేదికలను రివ్యూ చేసుకుని పందేల్లో పాల్గొంటున్నారు. ఏపీలో ఏ ప్రభుత్వం వస్తుంది? ఏ పార్టీ ఎన్ని సీట్లు గెలుస్తుంది? అన్న అంశాలపై ప్రధానంగా బెట్టింగ్ జరుగుతోంది. అలాగే, పలు కీలక నియోజకవర్గాల్లో ఎవరు గెలుస్తారు? గెలిస్తే ఎంత మెజారిటీ వస్తుంది? అన్న అంశంపై కూడా ఎక్కువ బెట్టింగ్ సాగుతోంది. 175 సీట్లలో వైఎస్సార్సీపీ 110 సీట్లు దాటుతుందని ఎక్కువ మంది పందెం కట్టగా.. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి వస్తుందని మరికొంతమంది బెట్టింగ్ కడుతున్నారు. వైసీపీ విజయంపై ఎప్పుడూ ధీమాగా ఉండే కడప బెట్టింగ్ టీమ్ సయితం ఫాన్ పార్టీపై వెనకడుగువేయడం గమనించదగ్గ విషయం. సీఎం జగన్, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మెజారిటీ, కడప ఎంపీ అభ్యర్థులపై ఎక్కువగా బెట్టింగ్‌లు చేస్తున్నారు. పార్టీలో నేతలు గెలుపుకోసం సర్వ శక్తులు వడ్డినట్లే.. అదేస్థాయిలో బెట్టింగ్ టీమ్ స్పీడ్ పెంచాయి. ఇటీవల వచ్చిన జాతీయ, ప్రాంతీయ మీడియా సంస్థల సర్వేల ఆధారంగా పందాలు వేస్తున్నారు.
తాజా వార్తలు
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్‌లో అస్సాం రైఫిల్స్‌పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!