మరోసారి హైదరాబాద్‌లో డ్రగ్స్ కలకలం..!
- May 17, 2024
హైదరాబాద్: హైదరాబాద్ నగరంలో మరోసారి డ్రగ్స్ పట్టుబడటం కలకలం రేపింది. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు నగరంలోని కూకట్పల్లి పరిధిలోని శేషాద్రినగర్‌లో స్థానిక పోలీసులతో కలిసి ఎస్వోటీ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ సోదాల్లో అధికారులు 3 గ్రాములు ఎంఎంబీఏ మాదకద్రవ్యం స్వాధీనం చేసుకున్నారు. అనంతరం డ్రగ్స్ విక్రయిస్తున్న రాజశేఖర్, శైలేష్ రెడ్డి అనే ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు.
అలాగే తులసీనగర్‌లో జగద్గిరిగుట్ట పోలీసులతో కలిసి ఎస్‌వోఓటీ పోలీసులు సోదాలు నిర్వహించారు. రోహిత్, తిలక్ సింగ్ అనే ఇద్దరు నిందితుల వద్ద 45 గ్రాముల గంజాయితో పాటు 3 గ్రాముల ఎంఎండీఏ పట్టుబడింది. దాంతో ఆ ఇద్దరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదుచేసి విచారిస్తున్నారు.
తాజా వార్తలు
- మణిపూర్‌లో అస్సాం రైఫిల్స్‌పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!
- వరల్డ్ టాప్ 10 సురక్షితమైన దేశాలలో ఒమన్..!!
- కువైట్ లో 'దిస్ ఈస్ యువర్ రోల్' ప్రారంభం..!!
- బహ్రెయిన్, ఇండియా మధ్య లీగల్, ట్యాక్స్ సహకారం..!!