దుబాయ్ నివాసితులు dh3000 అదనపు అద్దె చెల్లించాలా?

- May 18, 2024 , by Maagulf
దుబాయ్ నివాసితులు dh3000 అదనపు అద్దె చెల్లించాలా?

దుబాయ్: నిర్మాణాత్మక సమస్యల కారణంగా తమ ఇళ్లను ఖాళీ చేసి వచ్చి దాదాపు ఒక నెల అవుతుందని అల్ ఖసీర్ భవనంలోని నివాసితులు వాపోయారు. 10 రోజుల వరకు, మా ఇంటి యజమాని మా బస కోసం మా ఖర్చులను తిరిగి ఇస్తానని ప్రతిపాదించాడని రెండు సంవత్సరాలుగా భవనంలో నివసిస్తున్న నావల్ చెప్పారు.ఆ తర్వాత మే 12న మా ఇళ్లకు తిరిగి రావచ్చని మాకు చెప్పారని,  కానీ అలా జరగలేదన్నారు. ఇప్పుడు లేటెస్ట్ అప్ డేట్ ఏంటంటే.. నెలాఖరులోగా బిల్డింగ్ రెడీ అవుతుందట. అప్పటి వరకు తాము హోటల్ అపార్ట్‌మెంట్‌ల కోసం ఖర్చులు పెట్టాల్సిందేనని అన్నారు. ఏప్రిల్ 19 సాయంత్రం ముహైస్నా 4లోని భవనం దెబ్బతినడంతో అది కుంగింది.  అనంతరం అందులో ఉంటున్న నివాసితులను అధికారులు ఖాళీ చేయించారు.  దీంతో చుట్టుపక్కల ఉన్న భవనాల అద్దెలు అమాంతం పెరిగిపోయాయి. వాస్తవానికి, గత నెలలో తమ ఒప్పందాన్ని పునరుద్ధరించుకోవాల్సిన చాలా మంది నివాసితులు తమ అద్దెలలో Dh2,000 నుండి Dh3,000 వరకు పెరుగుదలను ఎదుర్కొన్నారు. ఎందుకంటే చాలా కుటుంబాలు ఇళ్ల కోసం వెతుకుతున్నందున డిమాండ్ ఎక్కువగా ఉంది. ఇదే అదనుగా కొందరు ఏజెంట్లు చాలా కమీషన్ వసూలు చేసినట్టు నివాసితులు వాపోయారు.   కొంతమంది నివాసితులు ఇతర ఇళ్లకు మారుతుండగా, మరికొందరు భవనంలోకి తిరిగి వెళ్లడానికి అనుమతి కోసం వేచి ఉన్నారు.   

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com