ఈ-స్కూటర్లకు ట్రాఫిక్ భద్రతా నియమాలు తప్పనిసరి
- May 18, 2024
దోహా: ఎలక్ట్రిక్ స్కూటర్ (ఈ-స్కూటర్) రైడర్లు తమ భద్రత,ఇతరుల కోసం ట్రాఫిక్ భద్రతా నియమాలను తప్పనిసరిగా పాటించాలని ట్రాఫిక్ అధికారి తెలిపారు. "ఇ-స్కూటర్లు నడిపేవారు తప్పనసరిగా హెల్మెట్లు ధరించాలని, ముందు మరియు వెనుక భాగంలో లైట్లు ఉండాలి." అని జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ ట్రాఫిక్ లెఫ్టినెంట్ హమద్ సలేం అల్ నహాబ్లోని ట్రాఫిక్ అవేర్నెస్ ఆఫీసర్ చెప్పారు. ఇ-స్కూటర్ రైడర్లు ఇతర వాహనదారులకు స్పష్టం కనిపించే రిఫ్లెక్టివ్ వెస్ట్‌లను ధరించాలని అన్నారు. వారు రోడ్లపై నియమించబడిన స్థలాలను ఉపయోగించాలని, సైక్లిస్టుల కోసం కేటాయించిన ప్రదేశాలను ఉపయోగించాలని అల్ నహబ్ తెలిపారు. డెలివరీ మోటార్‌బైక్‌ల గురించి అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ.. జనవరి 15, 2024 నుండి రోడ్ల సరైన లేన్‌ను ఉపయోగించని డెలివరీ మోటార్సైకిల్దారులపై జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ ట్రాఫిక్ ఉల్లంఘనలను రికార్డ్ చేయడం ప్రారంభించిందని ఆయన చెప్పారు. నిర్దేశించిన నిబంధనలు ఉల్లంఘించిన వారికి జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ ట్రాఫిక్ QR500 జరిమానా విధిస్తుందని అల్ నహాబ్ హెచ్చరించారు.
తాజా వార్తలు
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!
- వరల్డ్ టాప్ 10 సురక్షితమైన దేశాలలో ఒమన్..!!
- కువైట్ లో "దిస్ ఈస్ యువర్ రోల్" ప్రారంభం..!!
- బహ్రెయిన్, ఇండియా మధ్య లీగల్, ట్యాక్స్ సహకారం..!!
- ఒమన్‌తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..