భారీగా పెరిగిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ దంపతుల ఆస్తులు
- May 19, 2024లండన్: బ్రిటన్ ప్రధానమంత్రి రిషి సునాక్, ఆయన భార్య అక్షతా మూర్తి ఆస్తులు గతేడాది అమాంతం పెరిగిపోయాయి. గత ఏడాది ఈ దంపతుల ఆస్తి సుమారు 120 మిలియన్ పౌండ్లు పెరిగినట్లు తాజా నివేదికలు తెలిపాయి. దీంతో ఆ ఇద్దరి ఆస్తి మొత్తం విలువ 651 మిలియన్ పౌండ్లకు చేరుకున్నట్లు యూకేకు చెందిన ఐటీవీ తెలిపింది. వారి సంపద మునుపటి సంవత్సరంలో 529 మిలియన్ పౌండ్లుగా ఉండగా.. ఇప్పుడు 651 మిలియన్ పౌండ్లకు చేరిందని వెల్లడించింది. కాగా, ప్రస్తుత ఆర్థిక సంక్షోభ పరిస్థితుల నేపథ్యంలో బ్రిటన్లోని బిలియనీర్ల ఆస్తులు నేల చూపులు చూస్తున్న వేళ..
ప్రధాని రిషి సునాక్ దంపతుల ఆస్తులు భారీగా పెరగడం గమనార్హం. అయితే, తండ్రి నారాయణ మూర్తి ఇండియన్ కంపెనీ ఇన్ఫోసిస్లో అక్షతా మూర్తికి అధిక షేర్లు ఉన్న కారణంగా వాళ్ల ఆస్తులు పెరిగినట్లు అంచనా వేస్తున్నారు. ఆ కంపెనీలో ఉన్న అక్షత షేర్లు సుమారు 108.8 మిలియన్ పౌండ్లకు పెరిగినట్లు తెలుస్తోంది. ఇక సునాక్ దంపతులతో పాటు కింగ్ ఛార్లెస్ ఆస్తులు కూడా పెరిగాయి. గత ఏడాది 600 మిలియన్ పౌండ్ల నుంచి 610 మిలియన్ పౌండ్లకు పెరిగింది. బ్రిటన్లోని 350 మంది సంపన్న వ్యక్తులు, కుటుంబాలు ఏకంగా 795.36 బిలియన్ పౌండ్ల సంపదను కలిగి ఉన్నాయని తాజా డేటా వెల్లడించింది.
తాజా వార్తలు
- తెలంగాణలో నేటి నుంచి ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక
- భారీ భూకంపంతో కాలిఫోర్నియాలో సునామీ హెచ్చరికలు
- చికాగోలో NATS ఆధ్వర్యంలో దీపావళి వేడుకలు
- అవిశ్వాస తీర్మానంలో ఓడిన ఫ్రాన్స్ ప్రధాని బార్నియర్
- అల్లు అర్జున్ పై కేసు నమోదు చేసి సమన్లు జారీ చేసిన పోలీసులు
- యూఏఈలో కార్ వాష్ రూల్స్: మురికి వాహనాలపై Dh3,000 వరకు ఫైన్..!!
- విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్
- చమురు ఉత్పత్తి కోతలను 3 నెలలు పొడిగించిన ఒపెక్ దేశాలు..!!
- 'దుక్మ్-1' రాకెట్ను విజయవంతంగా ప్రయోగించిన ఒమన్..!!
- బహ్రెయిన్ ఫెస్టివిటీస్ 2024..12 క్రూయిజ్ షిప్లకు స్వాగతం..!!