యాదాద్రి భక్తులకు డ్రెస్ కోడ్.. జూన్ 1 నుంచి అమల్లోకి..
- May 19, 2024తెలంగాణలోని ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో భక్తులకు ఇప్పుడు డ్రెస్ కోడ్ తప్పనిసరి. నరసింహస్వామిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులు సంప్రదాయ దుస్తులు ధరించాలని యాదగిరిగుట్ట దేవస్థానం నిర్ణయించింది. వివిధ సేవల్లో పాల్గొనే భక్తులు తప్పనిసరిగా సంప్రదాయ దుస్తులు ధరించాలనే నిబంధన జూన్ 1 నుంచి అమల్లోకి రానుంది. కాగా.. యాదాద్రి ఆలయ పునర్నిర్మాణం అనంతరం లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకునే భక్తుల సంఖ్య పెరుగుతోంది. ఆలయంలో ఇప్పటికే ఆలయ ఈవోతో పాటు సిబ్బంది కూడా డ్రెస్ కోడ్‌ను పాటిస్తున్నారు. హిందూ సంప్రదాయాన్ని ప్రతిబింబించేలా భక్తులు సంప్రదాయ దుస్తులు ధరించేలా చర్యలు తీసుకోవాలని యాదగిరిగుట్ట దేవస్థానం నిర్ణయించింది. నిత్య కల్యాణం, హోమం, జోడు సేవ, శ్రీసుదర్శన నరసింహ హోమం, శ్రీసత్యనారాయణ స్వామి వ్రతాలు తదితర కార్యక్రమాల్లో పాల్గొనే భక్తులు సంప్రదాయ వస్త్రాలు ధరించాలని నిబంధన విధించారు.
తిరుమల తిరుపతి దేవస్థానం మాదిరిగానే యాదాద్రిలో కూడా భక్తుల వీఐపీ బ్రేక్ దర్శనానికి డ్రెస్ కోడ్ తప్పనిసరి చేసింది. స్వామివారి విరామ దర్శనానికి వచ్చే భక్తులకు ఈ నిబంధన తప్పనిసరిగా వర్తిస్తుందని, అదేవిధంగా సాధారణ ధర్మ దర్శనానికి క్యూ లైన్‌లో వచ్చే భక్తులకు ఈ నిబంధన నుంచి మినహాయింపు ఉందని యాదగిరిగుట్ట దేవస్థానం ఈవో భాస్కర్‌రావు తెలిపారు. జూన్ 1 నుంచి ఆలయంలో డ్రెస్ కోడ్ నిబంధనలు కఠినంగా అమలు చేయనున్నట్లు తెలిపారు. ఇదిలా ఉండగా ఆలయంలో ఆధ్యాత్మికత, భక్తి భావాన్ని పెంపొందించేందుకే ఇలాంటి నిబంధనలు అమలు చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఆలయానికి వచ్చే భక్తులకు యాదాద్రీశు క్షేత్ర ప్రాధాన్యతను తెలియజేసేందుకు సూచిక బోర్డులు ఏర్పాటు చేస్తున్నామని, బోర్డుపై క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే వివరాలు వచ్చేలా చర్యలు తీసుకుంటున్నామని ఈవో భాస్కర్ రావు తెలిపారు. తెలుగు, హిందీ మరియు ఆంగ్లంలో ఈ ప్రాంతం యొక్క ప్రాముఖ్యత గురించి. జూన్ 1 నుంచి అమలు చేయనున్న సంప్రదాయ వస్త్రధారణకు భక్తులందరూ సహకరించాలని కోరారు.
తాజా వార్తలు
- కాన్సస్లో దిగ్విజయంగా NATS బ్యాడ్మింటన్ టోర్నమెంట్
- తెలంగాణకు భారీ ఒప్పందం
- డిపోల ప్రైవేటీకరణ దుష్ప్రచారాన్ని ఖండించిన TGSRTC
- మహారాష్ట్రలో ఘోర రైలు ప్రమాదం...11 మంది మృతి
- తిరుపతి తొక్కిసలాట పై న్యాయ విచారణకు ఆదేశం
- ఘనంగా ముగిసిన రాచకొండ కమిషనరేట్ ఆరవ ఎడిషన్ వార్షిక స్పోర్ట్స్ మీట్-2025
- బిల్ గేట్స్తో సీఎం చంద్రబాబు భేటీ
- అరుదైన చికిత్స చేసిన మెడికవర్ ఉమన్ & చైల్డ్ హాస్పిటల్స్ వైద్యులు
- శంషాబాద్ ఎయిర్పోర్ట్కు రెడ్ అలర్ట్..
- కువైట్ లో కొత్త ట్రాఫిక్ చట్టం.. అవగాహన ప్రచారాలను ముమ్మరం..!!