నిద్ర సరిగా పట్టడం లేదా.? అయితే సింపుల్‌గా ఇలా చేసి చూడండి.!

- May 21, 2024 , by Maagulf
నిద్ర సరిగా పట్టడం లేదా.? అయితే సింపుల్‌గా ఇలా చేసి చూడండి.!

చాలా మందిలో నిద్రలేమి సమస్య వుంటుంది. ఏం చేసినా నిద్ర సరిగా పట్టదు. అందుకోసం కొందరయితే నిద్ర మాత్రలు వాడాల్సి వస్తుంది కూడా.

కానీ, చాలా సింపుల్‌గా నిద్రలేమి సమస్య నుంచి బయటపడొచ్చని నిపుణులు చెబుతున్నారు. అందుకు చేయాల్సిందల్లా.. రాత్రి పడుకునే ముందు ఒక్క అరటి పండు తినడమే.

చూశారా సమస్య అరటి పండు తిన్నంత ఈజీగా సాల్వ్ అయిపోయింది. అరటి పండు తింటే నిద్రలేమీ తగ్గిపోతుందా.? అంటే తగ్గేందుకు అవకాశాలున్నాయని నిపుణులు చెబుతున్నారు.

అరటి పండులోని ట్రిప్టోఫాన్ అనే అమినో యాసిడ్ నిద్రను ప్రేరేపించే సెరోటోనిన్‌ని ప్రభావితం చేస్తుంది. అరటి పండులోని అమినో యాసిడ్ సెరోటోనిన్ మెలటోనిన్‌గా మార్చడంతో నిద్రకు ఉపక్రమించేలా నాడుల్ని యాక్టివ్ చేస్తాయ్.

అంతేకాదు, అరటి పండులోని మెగ్నీషియం మరియు పొటాషియం కండరాల సడలింపును నియంత్రిస్తాయ్ తద్వారా కండరాలు రిలాక్స్ అవుతాయ్. పడుకునే ముందు అరటి పండు తినడం వల్ల ఈ లాభాలు ఖచ్చితంగా జరుగుతాయ్.

అందుకే నిద్రకుపక్రమించే ముందు ప్రతీ రోజూ ఓ అరటి పండు తినడం వల్ల సుఖ నిద్ర సొంతమవుతుంది. అంతేకాదు, అరటి పండులో ఆరోగ్యానికి అవసరమైన ఖనిజాలు పుష్కలంగా వుంటాయ్. ఊబకాయాన్ని కలిగించే క్యాలరీలు తక్కువగా వుంటాయ్. జీర్ణశక్తి మెరుగుపడుతుంది. అందుకే ప్రతీరోజూ అరటి పండు తినడం ఆరోగ్యానికి చాలా మంచిది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com