చేతులు లావుగా వున్నాయా.? ఈ సింపుల్ టిప్స్ ఫాలో చేయండి.!
- May 21, 2024
చాలా మందిలో శరీరం నాజూగ్గా వుండి చేతులు మాత్రం లావుగా వుంటాయ్. చేతులు పైకెత్తితే జెల్లీలా కిందికి జారుతూ వుంటుంది. ఈ సమస్య నుంచి బయటపడేందుకు చాలా మంది అనేక రకాల వర్కవుట్లు చేస్తుంటారు.
అంతలా కష్టపడాల్సిన అవసరమేమీ లేదని అంటున్నారు ఎక్స్‌పర్ట్స్. రోజూ మనం చేయగలిగే అతి చిన్న వ్యాయామాలతోనే చేతుల వద్ద వున్న కొవ్వును ఈజీగా కరిగించుకోవచ్చు.
వాకింగ్ అనేది చాలా కామన్ ఎక్సర్‌సైజ్. వాకింగ్‌లో శరీరమంతా బ్యాలెన్స్‌డ్‌గా మూవ్ అవుతూ వుంటుంది. ఇదే ప్రక్రియలో చేతుల్ని కాస్త ముందుకూ వెనుకకు తిప్పుతూ ఇంకాస్త ఎక్కువగా కదిలిస్తే సరిపోతుంది.
అలాగే ‘ఫార్వార్డ్ పంచ్’ చేయడం వల్ల కూడా చేతుల వద్ద కొవ్వు కరిగించుకోవచ్చు. ఫార్వార్డ్ పంచ్ అంటే, ఒక్కో చేతిని ముందుకు చాచి పంచ్ ఇవ్వాలి. పంచ్ బ్యాగ్‌పై పంచ్ ఇస్తే మంచిది. ముందుగా కుడి చేతిని ముందుకు చాచి పంచ్ బ్యాగ్‌ని చేతితో ఢీకొట్టాలి. ఒకవేళ పంచ్ బ్యాగ్ లేకుంటే, వాకింగ్ చేస్తున్నప్పుడు చేతుల్ని ఒకదాని తర్వాత ఒకటిగా ముందుకు చాచి పంచ్ చేసినా ఫలితం వుంటుంది.
తాజా వార్తలు
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!
- వరల్డ్ టాప్ 10 సురక్షితమైన దేశాలలో ఒమన్..!!
- కువైట్ లో "దిస్ ఈస్ యువర్ రోల్" ప్రారంభం..!!
- బహ్రెయిన్, ఇండియా మధ్య లీగల్, ట్యాక్స్ సహకారం..!!
- ఒమన్‌తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..