గ్లోబల్ హ్యుమానిటేరియన్ అవార్డును అందుకున్న యూఏఈ ప్రెసిడెంట్
- May 22, 2024
అబుదాబి: ప్రెసిడెంట్ హిస్ హైనెస్ షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ PAM గ్లోబల్ హ్యుమానిటేరియన్ పర్సనాలిటీ అవార్డును అందుకున్నారు. దశాబ్దాల పాటు అంకితభావంతో సేవలందించిన అంతర్జాతీయ మానవతా ప్రయత్నాలకు ఆయన చేసిన విశేష కృషికి గుర్తింపుగా ఈ అవార్డు లభించింది. అబుదాబిలోని కస్ర్ అల్ బహర్‌లో జరిగిన సమావేశంలో ఆయనను గ్లోబల్ హ్యుమానిటేరియన్ పర్సనాలిటీగా ఎంపిక చేసినందుకు ప్రతినిధి బృందానికి హిస్ హైనెస్ తన కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యంగా విపత్తులు మరియు సంక్షోభ ప్రాంతాలలో సమస్యలను తగ్గించడానికి యూఏఈ తన ప్రపంచ భాగస్వాముల సహకారంతో ఈ మానవతా విధానాన్ని కొనసాగిస్తుందని హిస్ హైనెస్ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా హిస్ హైనెస్ షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ మానవతా కార్యక్రమాలను ప్రతినిధి బృందం ప్రశంసించింది. ప్రాంతీయంగా మరియు ప్రపంచవ్యాప్తంగా వివిధ ప్రాంతాలకు సహాయం చేసిన మానవతావాద ప్రయత్నాల ఫలితమే గ్లోబల్ హ్యుమానిటేరియన్ పర్సనాలిటీగా ఎంపిక చేసినట్టు వారు కొనియాడారు. ప్రపంచవ్యాప్తంగా మానవతా కారణాల కోసం AED 20 బిలియన్లను యూఏఈ కేటాయించిందని గుర్తుచేశారు. ఈ కార్యక్రమంలో అబుదాబి క్రౌన్ ప్రిన్స్ షేక్ ఖలీద్ బిన్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ హాజరయ్యారు. వారితోపాటు అబుదాబి డిప్యూటీ పాలకుడు షేక్ హజ్జా బిన్ జాయెద్ అల్ నహ్యాన్, జాయెద్ ఛారిటబుల్ అండ్ హ్యుమానిటేరియన్ ఫౌండేషన్ యొక్క ట్రస్టీల బోర్డు ఛైర్మన్ షేక్ నహ్యాన్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్, బోర్డ్ ఆఫ్ జాయెద్ హయ్యర్ ఆర్గనైజేషన్ ఫర్ పీపుల్ ఆఫ్ డిటర్మినేషన్ (ZHO)షేక్ ఖలీద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ తదితరులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- వరద ప్రభావిత ప్రాంతాల్లో కొనసాగుతున్న సహాయక చర్యలు.. నేపాల్‌కు భారత్ రెస్క్యూ బృందాల సహకారం
- అబుదాబిలో ADIHEX ప్రదర్శనను సందర్శించిన షేక్ మహమ్మద్
- యూఏఈలో అనధికార ఆన్లైన్ ఫత్వా ఖాతాల పై చర్యలు..
- సెంచరీతో చెలరేగిన డీజీపీ సీవీ ఆనంద్..
- యూఏఈలో పర్సనల్ లోన్ చెల్లింపులు నిలిచిపోతే ఏమవుతుంది?
- దుబాయ్ ఎయిర్‌పోర్టులో కొత్త స్కానర్లు..
- భారతీయులకు ఉజ్బెకిస్తాన్ బంపరాఫర్..
- మసందమ్‌లో కొత్త రహదారి..ఖసబ్-దిబ్బా ప్రయాణ సమయం 55 నిమిషాలకు తగ్గింపు
- హైదరాబాద్ లో అతిపెద్ద క్రికెట్ స్టేడియం..
- ప్రధాని మోదీకి ఉజ్బెకిస్థాన్ అత్యున్నత పురస్కారం







