సన్‌రైజర్స్ హైదరాబాద్ Vs రాజస్థాన్ రాయల్స్..
- May 24, 2024
ఐపీఎల్ 2024లో మరో రెండు మ్యాచులు (క్వాలిఫయర్ 2, ఫైనల్) మాత్రమే మిగిలాయి. క్వాలిఫయర్ 2 మ్యాచులో నేడు సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ తలపడనున్నాయి. చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. ఇందులో గెలిచిన జట్టు ఫైనల్లో కేకేఆర్ తో తలపడుతుంది.
క్వాలిఫయర్ 1లో కోల్‌కతా నైట్ రైడర్స్‌తో పోటీపడ్డ సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫైనల్స్‌కు చేరుకునే తొలి అవకాశాన్ని కోల్పోయిన విషయం తెలిసిందే. కోల్‌కతా నైట్ రైడర్స్ ఆ మ్యాచులో 160 పరుగుల లక్ష్యాన్ని ఎనిమిది వికెట్లు, 38 బంతులు మిగిలి ఉండగానే ఛేదించింది. హైదరాబాద్ జట్టుకు ఇవాళ మరో అవకాశం ఉంది. ఎలిమినేటర్ మ్యాచులో ఆర్సీబీని ఓడించి ఫామ్‌లో ఉన్న ఆర్ఆర్ ను ఇవాళ ఓడిస్తే హైదరాబాద్ జట్టు ఫైనల్ చేరుతుంది.
ఎంఏ చిదంబరం స్టేడియంలోని జరిగిన ఐపీఎల్ 2024 మ్యాచుల్లో కొన్నింట్లో స్కోరు భారీగా నమోదు కాగా, కొన్నింట్లో మాత్రం తక్కువగా నమోదైంది. చెన్నై సూపర్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్ మధ్య గత నెల 23న జరిగిన మ్యాచులో అత్యధిక స్కోర్ నమోదైంది. సీఎస్కే జట్టు 20 ఓవర్లలో 210/4 పరుగులు చేసింది. ఆ లక్ష్యాన్ని లక్నో జట్టు 6 వికెట్లు, 3 బంతులు మిగిలి ఉండగానే ఛేదించింది. ఇవాళ సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ మధ్య హైవోల్టేజ్ మ్యాచ్ జరిగే అవకాశం ఉంది.
హైదరాబాద్ జట్టు (అంచనా): ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, రాహుల్ త్రిపాఠి, నితీశ్ రెడ్డి, హెన్రిచ్ క్లాసెన్, అబ్దుల్ సమద్, షాబాజ్ అహ్మద్, పాట్ కమిన్స్, భువనేశ్వర్ కుమార్, విజయకాంత్ వియాస్కాంత్, నటరాజన్
రాజస్థాన్ జట్టు (అంచనా): యశస్వి జైస్వాల్, టామ్ కోహ్లర్ కాడ్మోర్, సంజు శాంసన్, రియాన్ పరాగ్, ధృవ్ జురెల్, షిమ్రాన్ హెట్మెయర్, రోవ్‌మన్ పావెల్, రవిచంద్రన్ అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, అవేష్ ఖాన్, యజువేంద్ర చాహల్
తాజా వార్తలు
- బహ్రెయిన్-భారత్ సంబంధాల బలోపేతంపై ప్రశంసలు..!!
- త్వరలో యూనిఫైడ్ గల్ఫ్ టూరిస్ట్ వీసా..!!
- దుబాయ్‌లో టండూర్ టీనా రెస్టారెంట్ శాశ్వతంగా మూసివేత..!!
- OUN యాప్‌లో మున్సిపాలిటీ మంత్రిత్వ శాఖ 38 కొత్త సేవలు..!!
- మస్కట్‌లో సమావేశమైన ఒమన్-బ్రిటన్ వర్కింగ్ గ్రూప్స్..!!
- జహ్రాలో అనుమతి లేని గ్రోసెరీ స్టోర్ గుట్టురట్టు..!!
- గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయ స్థలాల పై AAI పరిశీలన..!
- అగ్నిపర్వతం బద్దలు..301 విమాన సర్వీసులకు అంతరాయం
- దుబాయ్‌లో మధ్యప్రదేశ్ ప్రత్యేక ODOP ఉత్పత్తుల ప్రదర్శన
- గ్రేటర్ పారిస్‌లో ‘నమస్తే’ శిల్పం ఆవిష్కరణ







