కవిత బెయిల్ పిటిషన్లపై ఈరోజు ఢిల్లీ హైకోర్టులో విచారణ
- May 24, 2024
హైదరాబాద్: ఢిల్లీ మద్యం పాలసీ కేసులో అరెస్టై తీహార్ జైల్లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్లపై శుక్రవారం ఢిల్లీ హైకోర్టులో విచారణ జరగనుంది. జస్టిస్ స్వర్ణకాంత శర్మ ధర్మాసనం విచారణ జరపనుంది. ఈడీ, సీబీఐ కేసుల్లో తన బెయిల్‌ను తిరస్కరిస్తూ ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పును కవిత హైకోర్టులో సవాల్ చేశారు.
ఈడీ, సీబీఐ కేసుల్లో మే 6న కవిత బెయిల్ పిటిషన్లను ట్రయల్ కోర్టు తిరస్కరించింది. కవిత 9న ఢిల్లీ హైకోర్టులో బెయిల్ పిటిషన్లు దాఖలు చేశారు. ఈడీ కేసులో ఈ నెల 10న, సీబీఐ కేసులో ఈ నెల 16న స్వర్ణకాంత శర్మ బెంచ్ విచారించింది. తదుపరి విచారణను కోర్టు ఈరోజుకు వాయిదా వేసింది. ఢిల్లీ మద్యం పాలసీ కేసులో మార్చి 16న ఈడీ, ఏప్రిల్ 11న సీబీఐ కవితను అరెస్ట్ చేశాయి. జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉన్న కవిత ప్రస్తుతం తీహార్ జైల్లో ఉన్నారు.
తాజా వార్తలు
- హాంకాంగ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..13 మంది సజీవదహనం..
- అల్-మసీలా బ్రిడ్జి అభివృద్ధికి సమగ్ర ప్రణాళిక..!!
- కెనడా eTA కి ఖతారీ జాతీయులు అర్హులు..!!
- సౌదీ అరేబియాలో జనవరి 1నుండి న్యూ ట్యాక్స్ పాలసీ..!!
- మరణించిన వారి ఫోటోలను ఆన్లైన్లో పోస్ట్ చేస్తున్నారా?
- 'ఒమన్ ఒడిస్సీ' పుస్తకం విడుదల..!!
- BD 130,000 పెట్టుబడికే బహ్రెయిన్ గోల్డెన్ రెసిడెన్సీ..!!
- ప్రపంచ నెంబర్ వన్ బ్యాట్స్‌మన్‌గా హిట్‌మ్యాన్
- పైరసీ సైట్ల నుంచి సినిమాలు కొనుగోలు చేసి హెచ్డి అప్లోడ్
- ఏవియేషన్ హబ్‌గా భారత్







