హైదరాబాదీలకి గుడ్ న్యూస్..కింగ్ కోహ్లీ ప్రత్యేక ఆహ్వానం..
- May 24, 2024
హైదరాబాద్: భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ పలు రంగాల్లో తనదైన శైలిలో చెరగని ముద్రవేసుకుంటూ దూసుకుపోతున్నారు. ఓ పక్క బ్రాండెడ్ క్లాత్ బిజినెస్‌తో పాటుగా కోహ్లీ మరోపక్క రెస్టారెంట్ల బిజినెస్ కూడా నిర్వహిస్తున్నాడు.
కొన్నేళ్లుగా కోహ్లీ వన్8 కమ్యూన్ పేరుతో రెస్టారెంట్లు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.
ఈ హోటల్స్ బెంగళూరు, ముంబై, పుణె, కోల్‌కతా, ఢిల్లీలో ఈ రెస్టారెంట్స్‌ని కోహ్లీ ఏర్పాటు చేశాడు. అక్కడ వీటి వ్యాపారం జోరుగా సాగుతుంది. తన వ్యాపారాన్ని మరింత విస్తరించేందుకు గాను హైదరాబాద్ మహానగరంలో తన రెస్టారెంట్ బిజినెస్ ప్రారంభించాడానికి సిద్ధమయ్యారు.
ఈ వన్8 కమ్యూన్ కొత్త బ్రాంచ్ని కోహ్లీ హైదరాబాద్‌లోని HITEC సిటీలోని హార్డ్ రాక్ కేఫ్ సమీపంలోని నాలెడ్జ్ సిటీలోని RMZ ది లాఫ్ట్‌లో శుక్రవారం గ్రాండ్‌గా ఓపెన్ కానుంది. ఈ విషయాన్ని కోహ్లీ తన ఇన్స్టాగ్రామ్ ద్వారా వెల్లడించారు. ఈ విషయాన్ని షేర్ చేసుకోవడానికి చాలా సంతోషిస్తున్నానని తెలిపారు.
తాజా వార్తలు
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్‌లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!







