రఫాపై దాడిని నిలిపివేయాలి.. ఇజ్రాయెల్‌ను ఆదేశించిన UN న్యాయస్థానం

- May 25, 2024 , by Maagulf
రఫాపై దాడిని నిలిపివేయాలి.. ఇజ్రాయెల్‌ను ఆదేశించిన UN న్యాయస్థానం

హేగ్: హేగ్‌లో శుక్రవారం జరిగిన సెషన్‌లో రఫా నగరంలో చేపట్టిన సైనిక దాడిని నిలిపివేయాలని ఐక్యరాజ్యసమితి ఉన్నత న్యాయస్థానంలోని న్యాయమూర్తులు ఇజ్రాయెల్‌ను ఆదేశించారు. దాదాపు 800,000 మంది పాలస్తీనియన్లు రాఫాలో తలదాచుకున్నారని, సైనిక దాడిలో మానవతావాద అంశాలను పదేపదే ఉల్లంఘిస్తున్నారని అంతర్జాతీయ న్యాయస్థానం అధ్యక్షుడు నవాఫ్ సలామ్ అభిప్రాయపడ్డారు. పాలస్తీనా ప్రజలు ప్రమాదంలో ఉన్నారని పేర్కొంటూ, ఇజ్రాయెల్ రఫాలో సైనిక దాడిని నిలిపివేయాలని ఆయన పిలుపునిచ్చారు. గతంలో మార్చిలో కోర్టు ఆదేశించిన తాత్కాలిక చర్యలు గాజాలో ఇప్పుడు పరిస్థితిని పూర్తిగా పరిష్కరించలేదని సలామ్ అన్నారు. గాజాలో వినాశకరమైన మానవతా పరిస్థితి కారణంగా ఈ అత్యవసర ఆదేశాలు అవసరమని ఆయన పేర్కొన్నారు. మారణహోమ చర్యలను నిరోధించాలని మరియు గాజాలోకి సహాయాన్ని అనుమతించాలని గతంలో ఇజ్రాయెల్‌ను ఆదేశించినందున, దాని సైనిక కార్యకలాపాలను నిలిపివేయమని కోర్టు ఇజ్రాయెల్‌కు చెప్పడం ఇదే మొదటిసారి. గాజాలో ఇజ్రాయెల్ చర్యలను దక్షిణాఫ్రికా అత్యవసర చర్య ద్వారా ICJకి తీసుకువచ్చింది. అంతకుముందు న్యాయస్థానంలో తమ సైనిక కార్యకలాపాలు హమాస్‌ను లక్ష్యంగా చేసుకున్నాయని ఇజ్రాయెల్ వాదించింది.  ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహూ తీర్పు వచ్చిన వెంటనే ఒక ప్రత్యేక మంత్రివర్గ సమావేశాన్ని ఏర్పాటు చేస్తారని చెప్పారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com