గుజరాత్‌లో భారీ అగ్ని ప్రమాదం..22 మంది సజీవ దహనం
- May 25, 2024
గుజరాత్: గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఇవ్వాళ (శనివారం) సాయంత్రం టీఆర్‌పీ గేమింగ్ జోన్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో చిక్కుకుని 22 మంది సజీవ దహనమయ్యారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. కాగా, మృతుల్లో ఇద్దరు చిన్నారులు, ఒక మహిళ ఉన్నారు. ప్రమాదం గురించి తెలియగానే ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పే ప్రయత్నాలు మొదలుపెట్టారు.
కాగా, మృతుల సంఖ్యను సరిగ్గా అంచనా వేయలేమని ఫైర్ స్టేషన్ ఆఫీసర్ ఆర్‌ఏ జోబన్ తెలిపారు. ప్రమాద స్థలం నుంచి మృతదేహాలను వెలికి తీస్తున్నామని.. సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతుందని చెప్పారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.
తాజా వార్తలు
- కెసిఆర్ కు సిట్ ఇచ్చిన నోటీసులు చెల్లవు: BRS లాయర్
- భక్తులకు టీటీడీ అలర్ట్: మార్చి 3న ఆలయం మూసివేత
- పీటీ ఉషా భర్త శ్రీనివాసన్ కన్నుమూత
- తాడేపల్లిగూడెంలో కొత్త విమానాశ్రయం ఏర్పాటుకు ప్రభుత్వం ప్రతిపాదన
- డబ్డూబ్ వరల్డ్..2.5 KD ప్లే జోన్ ఆఫర్..!!
- ఫేక్ వర్క్ పర్మిట్లు.. ఎనిమిది మందికి శిక్షలు ఖరారు..!!
- ఒమన్ లో ఆర్కియాలజీపై ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్..!!
- సౌదీ అరేబియా జీడీపీ 4.8% వృద్ధి..!!
- జెబెల్ జైస్ జనవరి 31న రీ ఓపెన్..!!
- మెట్రోలింక్ సేవలను అప్డేట్ చేసిన దోహా మెట్రో..!!







