యాదాద్రి భక్తులకు గుడ్‌న్యూస్..
- May 25, 2024
తెలంగాణ: తెలంగాణ తిరుపతిగా పేరొందిన యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి క్షేత్రానికి ఏటా భక్తుల రద్దీ పెరుగుతోంది. ముఖ్యంగా వారాంతాల్లో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఈ క్రమంలో భక్తుల సౌకర్యార్థం యాదాద్రి దేవస్థానం అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. ఇకపై తిరుమలలో మాదిరిగానే యాదాద్రిలో కూడా భక్తులు ఆన్‌లైన్‌లో స్వామివారి దర్శనంతో పాటు ఆర్జిత సేవలను కూడా బుక్ చేసుకునే అవకాశం కల్పిస్తున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు.
స్వామివారి దర్శనం టిక్కెట్లతో పాటు ఆర్జిత సేవా టిక్కెట్లను ముందస్తుగా బుక్ చేసుకోవాలనుకునే భక్తులు http://yadadritemple.telangana.gov.in ను సందర్శించాలని.. అక్కడ టిక్కెట్లను బుక్ చేసుకోవచ్చని ఈవో తెలిపారు. ఈ సైట్ ద్వారా కూడా భక్తులు స్వామివారి ఈ-హుండీకి విరాళాలు ఇవ్వవచ్చని తెలిపారు. స్వామివారి దర్శనం, పూజా కైంకర్యానికి గంట ముందే ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవచ్చని యాదాద్రి దేవస్థానం అధికారులు వెల్లడించారు.
తాజా వార్తలు
- భక్తులకు టీటీడీ అలర్ట్: మార్చి 3న ఆలయం మూసివేత
- పీటీ ఉషా భర్త శ్రీనివాసన్ కన్నుమూత
- తాడేపల్లిగూడెంలో కొత్త విమానాశ్రయం ఏర్పాటుకు ప్రభుత్వం ప్రతిపాదన
- డబ్డూబ్ వరల్డ్..2.5 KD ప్లే జోన్ ఆఫర్..!!
- ఫేక్ వర్క్ పర్మిట్లు.. ఎనిమిది మందికి శిక్షలు ఖరారు..!!
- ఒమన్ లో ఆర్కియాలజీపై ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్..!!
- సౌదీ అరేబియా జీడీపీ 4.8% వృద్ధి..!!
- జెబెల్ జైస్ జనవరి 31న రీ ఓపెన్..!!
- మెట్రోలింక్ సేవలను అప్డేట్ చేసిన దోహా మెట్రో..!!
- 'ఫౌజీ' దసరాకి గ్రాండ్ గా రిలీజ్







