బేబీ కేర్ హాస్పిటల్లో అగ్నిప్రమాదం...ఆరుగురు శిశువులు మృతి
- May 26, 2024
న్యూ ఢిల్లీ : ఢిల్లీలోని వివేక్ విహార్లోని న్యూ బోర్న్ బేబీ కేర్ హాస్పిటల్లో శనివారం అర్థరాత్రి భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆరుగురు నవజాత శిశువులు ప్రాణాలు కోల్పోయారు.
ఢిల్లీ అగ్నిమాపక శాఖ ప్రకారం, ప్రమాదంలో చిక్కుకున్న మొత్తం 12 మంది పిల్లలనుల్లో ఆరుగురు మరణించారు. ఒకరు వెంటిలేటర్పై ఉండగా, ఐదుగురు ఆసుపత్రిలో చేరారు. రక్షించబడిన నవజాత శిశువులను తూర్పు ఢిల్లీ అడ్వాన్స్ ఎన్ఐసియు ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి కారణం తెలియాల్సి ఉంది.
సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. అగ్నిమాపక అధికారి రాజేష్ మాట్లాడుతూ… "రాత్రి 11:32 గంటలకు ఆసుపత్రిలో మంటలు చెలరేగినట్లు సమాచారం అందింది. మొత్తం 16 అగ్నిమాపక యంత్రాలు సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను పూర్తిగా ఆర్పివేశాయి. 2 భవనాలు మంటలకు దెబ్బతిన్నాయి. ఒకటి ఆసుపత్రి భవనం మరియు కుడి వైపున ఉన్న నివాస భవనం యొక్క 2 అంతస్తులు కూడా మంటల్లో చిక్కుకున్నాయి. 11-12 మందిని రక్షించి వారిని ఆసుపత్రికి తరలించారని" తెలిపారు.
తాజా వార్తలు
- సౌదీలో 2% పెరిగిన విదేశీ రెమిటెన్స్..!!
- దోహా, రియాద్ మధ్య 2గంటలు తగ్గనున్న ట్రావెల్ టైమ్..!!
- భారత్ కు బంగారం తీసుకువెళుతున్నారా?
- కువైట్ లో మాదకద్రవ్యాల రవాణకు పాల్పడితే ఉరిశిక్ష..!!
- గల్ఫ్ యూత్ లీడర్షిప్ ప్రోగ్రామ్ ప్రారంభం..!!
- ఒమన్ ఆయిల్, గ్యాస్ ఆవిష్కరణ..శతాబ్ది ఉత్సవాలు..!!
- నైజీరియాలో అపహరణకు గురైన 100 మంది పిల్లల అప్పగింపు
- తెలంగాణ తల్లి విగ్రహాలను ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి..
- ఇండిగో రద్దుల పై ప్రధాని మోదీ స్పందన
- కువైట్ వెదర్ అలెర్ట్..భారీ వర్షాలు..!!







