ఖతార్ లో 5కి.మీ ఎక్స్‌ప్రెస్ వే ప్రారంభం
- May 26, 2024
దోహా: పబ్లిక్ వర్క్స్ అథారిటీ 'అష్ఘల్' ఇండస్ట్రియల్ ఏరియాలోని స్ట్రీట్ 33ని 5 కి.మీ పొడవుతో అప్‌గ్రేడ్ చేసిన ఎక్స్‌ప్రెస్ వే ప్రారంభమైంది. ఈస్ట్ స్ట్రీట్ 33 ఇంటర్‌చేంజ్ మరియు ఇండస్ట్రియల్ ఏరియా రోడ్ వెస్ట్ ఇండస్ట్రియల్‌కు చేరుకునేలా రహదారిని నిర్మించారు. గంటకు 16,000 వాహనాలు వెళ్లే సామర్థ్యం ఉంది. స్ట్రీట్ 33లోని లేన్‌లను అన్ని దిశల్లో 3 లేన్‌ల నుంచి 4 లేన్‌లకు పెంచారు. స్ట్రీట్ 33ని ఆల్ కస్సరాత్ స్ట్రీట్ మరియు వెస్ట్ ఇండస్ట్రియల్ స్ట్రీట్‌తో అనుసంధానించారు. ఇందు కోసం రెండు కొత్త ఇంటర్‌ఛేంజ్‌లు నిర్మించారు. దోహా నుండి ఇండస్ట్రియల్ ఏరియా వైపు వచ్చే ట్రాఫిక్ సులువుగా చేరుకునేలా స్ట్రీట్ 33 ఇండస్ట్రియల్ ఏరియా రోడ్‌తో అనుసంధానించారు. ఇందులో ఈస్ట్ ఇండస్ట్రియల్ స్ట్రీట్, అల్ కస్సరాత్ స్ట్రీట్, వెస్ట్ ఇండస్ట్రియల్ స్ట్రీట్ వంటి ముఖ్యమైన రోడ్లు సల్వా రోడ్ మరియు జి-రింగ్ రోడ్ ఉన్నాయని హైవే ప్రాజెక్ట్స్ డిపార్ట్‌మెంట్ మేనేజర్ బాదర్ దర్విష్ వెల్లడించారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్-భారత్ సంబంధాల బలోపేతంపై ప్రశంసలు..!!
- త్వరలో యూనిఫైడ్ గల్ఫ్ టూరిస్ట్ వీసా..!!
- దుబాయ్‌లో టండూర్ టీనా రెస్టారెంట్ శాశ్వతంగా మూసివేత..!!
- OUN యాప్‌లో మున్సిపాలిటీ మంత్రిత్వ శాఖ 38 కొత్త సేవలు..!!
- మస్కట్‌లో సమావేశమైన ఒమన్-బ్రిటన్ వర్కింగ్ గ్రూప్స్..!!
- జహ్రాలో అనుమతి లేని గ్రోసెరీ స్టోర్ గుట్టురట్టు..!!
- గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయ స్థలాల పై AAI పరిశీలన..!
- అగ్నిపర్వతం బద్దలు..301 విమాన సర్వీసులకు అంతరాయం
- దుబాయ్‌లో మధ్యప్రదేశ్ ప్రత్యేక ODOP ఉత్పత్తుల ప్రదర్శన
- గ్రేటర్ పారిస్‌లో ‘నమస్తే’ శిల్పం ఆవిష్కరణ







