ఏపీ ఉద్యోగులకు శుభవార్త..

- June 10, 2016 , by Maagulf
ఏపీ ఉద్యోగులకు శుభవార్త..

ఏపీ ఉద్యోగులకు శుభవార్త. ఉద్యోగుల స్థానికతకు రాష్ర్టపతి ఆమోద ముద్రవేశారు. దీనికి సంబంధించి 4 పేజీల గెజిట్ నోటిఫికేషన్‌ ను కేంద్రం విడుదల చేసింది. దీంతో స్థానికతపై స్పష్టత ఏర్పడింది. ఇప్పటివరకు తెలంగాణలోవుండి విభజన నేపథ్యంలో తిరిగి ఏపీకి వెళ్లే వారి స్థానికతపై స్పష్టత లేకుండాపోయింది. హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లేవారికి అక్కడ స్థానికత వర్తించే విధంగా రాష్ట్రపతి ఉత్తర్వులను సవరించి గెజిట్ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఒకవిధంగా హైదరాబాద్‌లోవున్న ఏపీ ఉద్యోగులకు శుభవార్తే!
ఉద్యోగుల స్థానికతకు సంబంధించి అడ్డంకులను తొలగించాలని కోరుతూ ముఖ్యమంత్రి చంద్రద్రబాబునాయుడు అక్టోబర్‌లో కేంద్రానికి 7 పేజీల లేఖ రాసిన విషయం తెలిసిందే!సుమారు ఎనిమిది నెలల కసరత్తు అనంతరం స్థానికతపై తుది నిర్ణయం వెలువడింది. గత సోమవారం ఈ ఫైల్‌ను రాష్ట్రపతిభవన్‌కు పంపగా, శుక్రవారం నోటిఫికేషన్‌ను జారీ అయింది. 2017 జూన్ 2 నాటికి ఏపీకి తరలివెళ్లే ఉద్యోగులు, వారి పిల్లలు, సామాన్య ప్రజలకు స్థానికత కల్పించేలా రాష్ట్రపతి ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ నోటిఫికేషన్‌తో హైదరాబాద్ నుంచి ఏపీకి వెళ్లే ఉద్యోగుల స్థానికత అంశానికి ఫుల్‌స్టాప్ పడింది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com