ఎన్నికల ఫలితాలకు ముందు 2 రోజులు మోడీ ధ్యానం..ఈసారి ఎక్కడంటే..!
- May 28, 2024
దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పటికే ఆరు విడతల పోలింగ్ ముగిసింది. ఏడో విడత జూన్ 1న జరగనుంది. ఇప్పటికే ఆయా రాష్ట్రాల్లో పోలింగ్ ముగియడంతో నాయకులంతా విశ్రాంతి తీసుకుంటున్నారు. కొంతమంది విదేశాలకు వెళ్తే.. మరికొందరు స్వదేశంలోనే రెస్ట్ తీసుకుంటున్నారు. ఇక ప్రధాని మోడీ అయితే.. ఎన్నికల నోటిఫికేషన్‌కు ముందు నుంచీ.. విశ్రాంతి లేకుండా దేశ మంతా తిరుగుతూనే ఉన్నారు. ఇక చివరి విడత ఎన్నికల ప్రచారం రెండ్రోజుల్లోనే ముగియనుంది. ఇక ఎన్నికల ఫలితాలు రావడానికి మరింత సమయం ఉండడంతో ఈ మధ్యలోనే రెండ్రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని మోడీ నిర్ణయించుకున్నారు.
మే 30, 31 తేదీల్లో ప్రధాని మోడీ తమిళనాడులోని కన్యాకుమారిలో పర్యటించనున్నారు. కన్యాకుమారిలోని వివేకానంద రాక్ మెమోరియల్ దగ్గర ప్రధాని ధ్యానం చేయనున్నారు. రెండు రోజుల పాటు అక్కడే ఉండి ధ్యానం చేస్తారు. అనంతరం జూన్ 1న ఆయన కన్యాకుమారి నుంచి బయలుదేరి ఢిల్లీ వెళ్లనున్నారు.
2019 లోక్‌సభ ఎన్నికల కౌంటింగ్‌కు ముందు కూడా ప్రధాని ఉత్తరాఖండ్‌లోని కేదార్‌నాథ్ పుణ్యక్షేత్రంలో ప్రార్థనలు చేశారు. హిమాలయాల్లో 11,700 అడుగుల ఎత్తులో ఉన్న గుహలో ప్రధాని మోడీ ధ్యానం చేశారు. కేదార్‌నాథ్ నుంచి ఒక కిలోమీటరు దూరంలో ఉన్న ప్రసిద్ధి చెందిన రుద్ర ధ్యాన గుహలో రాత్రి గడిపారు.
మూడోసారి అధికారం కోసం బీజేపీ కృషి చేస్తోంది. హ్యాట్రిక్ సాధిస్తామని ప్రధాని మోడీ కూడా అంటున్నారు.543 లోక్‌సభ స్థానాలు ఉన్న పార్లమెంట్‌లో.. ఈసారి 400 సీట్లకు పైగా స్థానాలను ఎన్డీఏ కూటమి సాధించబోతున్నట్లు ప్రధాని మోడీ ఇప్పటికే ప్రకటించారు. ఇక ఎన్నికల ఫలితాలు జూన్ 4న విడుదలకానున్నాయి.
తాజా వార్తలు
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!
- GCC జాయింట్ డిఫెన్స్ కౌన్సిల్ అత్యవసర సమావేశం..!!
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!