హైదరాబాద్‌లో అత్యంత ప్రమాదకరమైన డ్రగ్స్ పట్టివేత
- June 01, 2024
హైదరాబాదులో డ్రగ్స్ అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. అధికారులు డ్రగ్స్ రహిత రాష్ట్రంగా చేసేందుకు ఎన్ని చట్టాలు తీసుకువస్తున్నా డ్రగ్స్ మాఫియా ఆగడాలు పెరుగుతున్నాయి. తాజాగా ఎక్సైజ్ పోలీసులు మరోసారి హైదరాబాద్ లో డ్రగ్స్ ముఠా గుట్టురట్టు చేశారు. ముంబై నుంచి అక్రమంగా తీసుకొచ్చి హైదరాబాద్ లో అమ్మాలని చూస్తున్న కుష్, ఓజీ డ్రగ్స్ ను లాలాగూడలో ఎక్సైజ్ అధికారులు పట్టుకున్నారు.
కాగా పట్టుబడిన డ్రగ్స్ విలువ రూ. 10 లక్షల వరకు ఉంటుందని అధికారులు తెలిపారు. ఈ కుష్, ఓజీ డ్రగ్ ఆఫ్రికా, అమెరికాలో ఎక్కువగా లభిస్తుందని.. ఇది అత్యంత ప్రమాదకరమని నిపుణులు తెలుపుతున్నారు. ఈ డ్రగ్ కారణంగా లివర్, కిడ్నీ సమస్యలు వస్తాయని వెల్లడించారు. ఈ కుష్, ఓజీ మందు ఆఫ్రికా, అమెరికాలో విరివిగా లభిస్తుందని.. ఇది చాలా ప్రమాదకరమని నిపుణులు చెబుతున్నారు. ఈ మందు వల్ల కాలేయం, కిడ్నీ సమస్యలు వస్తాయని వెల్లడించారు. వీరిని డ్రగ్స్‌తో పట్టుకుని విచారిస్తున్నట్లు ఎక్సైజ్ అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్-భారత్ సంబంధాల బలోపేతంపై ప్రశంసలు..!!
- త్వరలో యూనిఫైడ్ గల్ఫ్ టూరిస్ట్ వీసా..!!
- దుబాయ్‌లో టండూర్ టీనా రెస్టారెంట్ శాశ్వతంగా మూసివేత..!!
- OUN యాప్‌లో మున్సిపాలిటీ మంత్రిత్వ శాఖ 38 కొత్త సేవలు..!!
- మస్కట్‌లో సమావేశమైన ఒమన్-బ్రిటన్ వర్కింగ్ గ్రూప్స్..!!
- జహ్రాలో అనుమతి లేని గ్రోసెరీ స్టోర్ గుట్టురట్టు..!!
- గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయ స్థలాల పై AAI పరిశీలన..!
- అగ్నిపర్వతం బద్దలు..301 విమాన సర్వీసులకు అంతరాయం
- దుబాయ్‌లో మధ్యప్రదేశ్ ప్రత్యేక ODOP ఉత్పత్తుల ప్రదర్శన
- గ్రేటర్ పారిస్‌లో ‘నమస్తే’ శిల్పం ఆవిష్కరణ







