కౌంటింగ్ ఏర్పాట్లు పూర్తి: సీఈవో వికాస్ రాజ్
- June 01, 2024
హైదరాబాద్: కౌంటింగ్ కేంద్రాల వద్ద నాలుగు అంచెల భద్రత ఉంటుందని తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్‌రాజ్ తెలిపారు. హైదరాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కౌంటింగ్ కేంద్రంలో ఉండే ఏజెంట్లు, సిబ్బంది సెల్ఫోన్లు వినియోగించేందుకు అనుమతిలేదని స్పష్టం చేశారు. కౌంటింగ్ కేంద్రంలోకి ఎలక్ట్రానిక్ పరికరాలు తీసుకెళ్లవద్దని సూచించారు. స్ట్రాంగ్ రూమ్ నుంచి లెక్కింపు కేంద్రం వరకు పటిష్ఠ భద్రత ఉంటుందన్నారు. కౌంటింగ్ కేంద్రంలో ప్రతి మూల కవర్ చేసేలా సీసీ కెమెరాల నిఘా ఏర్పాటు చేశామన్నారు. పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు కోసం 276 టేబుళ్లు ప్రత్యేకంగా ఉంటాయన్నారు. జూన్ 4న ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్లు, 8.30 గంటలకు ఈవీఎంలలో ఓట్ల లెక్కింపు ప్రారంభం అవుతుందని తెలిపారు. మూడు అసెంబ్లీ సెగ్మెంట్లలో అత్యధికంగా 24 రౌండ్లలో, అత్యల్పంగా 13 రౌండ్లలో లెక్కింపు ఉంటుందన్నారు. కౌంటింగ్ కేంద్రాల్లో 2,400 మందికి పైగా మైక్రో అబ్జర్వర్లు ఉంటారని వికాస్‌రాజ్ తెలిపారు. ఓట్ల లెక్కింపులో దాదాపు 10వేల మంది సిబ్బంది పాల్గంటారని వివరించారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్-భారత్ సంబంధాల బలోపేతంపై ప్రశంసలు..!!
- త్వరలో యూనిఫైడ్ గల్ఫ్ టూరిస్ట్ వీసా..!!
- దుబాయ్‌లో టండూర్ టీనా రెస్టారెంట్ శాశ్వతంగా మూసివేత..!!
- OUN యాప్‌లో మున్సిపాలిటీ మంత్రిత్వ శాఖ 38 కొత్త సేవలు..!!
- మస్కట్‌లో సమావేశమైన ఒమన్-బ్రిటన్ వర్కింగ్ గ్రూప్స్..!!
- జహ్రాలో అనుమతి లేని గ్రోసెరీ స్టోర్ గుట్టురట్టు..!!
- గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయ స్థలాల పై AAI పరిశీలన..!
- అగ్నిపర్వతం బద్దలు..301 విమాన సర్వీసులకు అంతరాయం
- దుబాయ్‌లో మధ్యప్రదేశ్ ప్రత్యేక ODOP ఉత్పత్తుల ప్రదర్శన
- గ్రేటర్ పారిస్‌లో ‘నమస్తే’ శిల్పం ఆవిష్కరణ







