అబుధాబిలో ఘనంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలు
- June 02, 2024
అబుధాబి: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలు యూఏఈలోని అబుధాబిలో తెలంగాణ ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ఆదివారం జరిగిన ఈ ఉత్సవాలకు ప్రాంగణంగా అబుధాబిలోని BS ఈవెంట్స్ హాల్ అయింది.ఈ కార్యక్రమం లో మొదటగా దీప ప్రజ్వలన మరియు గణపతి వందన తో ప్రారంభించారు.ఆ తరువాత తెలంగాణ సిద్ధాంత కర్త కీర్తి శేషులు ఆచార్య కొత్తపల్లి జయశంకర్ చిత్ర పటానికి పూలమాల వేసి అసోసియేషన్ కార్యవర్గ సభ్యులందరూ నివాళులు అర్పించారు.ఈ కార్యక్రమాన్ని చిన్నారులు పాడిన తెలంగాణ ఉద్యమ గీతమైన జయహే జయహే తెలంగాణ తో వచ్చిన వారందరిలో ఉద్యమ కాలం నాటి స్మృతులను గుర్తు కు తెస్తూ ప్రారంభించారు.
ఈ కార్యక్రమానికి వచ్చిన వారిని ఉద్ద్యేశించి మాట్లాడుతూ తెలంగాణ అనేది ఒక రాష్ట్రం మాత్రమే కాదని అది ఒక స్ఫూర్తి అని, దాని మూలాలనూ ముందు తరాలకు చేరవేసే భాద్యత తల్లిదండ్రులదేనని తెలంగాణ ఫ్రెండ్స్ అసోసియేషన్ అధ్యక్షుడు రాజా శ్రీనివాస రావు తెలియజేశారు.తదనంతరం చాలా మంది చిన్నారులు చేసిన తెలంగాణ ఆట పాటలు కార్యక్రమానికి వచ్చిన వారిని ఎంతో ఆకర్షించాయి. కార్యక్రమాన్ని చిన్నారుల ద్వారా ఇంత ఆకర్షితంగా చూపించడానికి సహకరించిన చిన్నారుల తల్లిదండ్రుల పాత్ర మరువలేనిదని మరియు ఈ రకంగా ముందు తరాలకు తెలంగాణ చరిత్ర మరియు కళలు పంచిన వాళ్ళము అవుతామని ఈ కార్యక్రమానికి ప్రోగ్రాం యాంకర్ గా వ్యవహరించిన గోపినాథ్ మల్లెల అన్నారు.
ఈ కార్యక్రమానికి ఆహ్వానితులుగా వచ్చిన మల్లేష్ కోరేపు తనదయిన శైలిలో తెలంగాణ పాట పాడి ప్రేక్షకులను అలరించారు.ఈ సందర్బంగా జూన్ 9 నాడు దుబాయి లో స్పార్క్ మీడియా మరియు తెలంగాణ ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరుగనున్న దశాబ్ది ఉత్సవాల వేడుకల పోస్టర్ రిలీజ్ చేశారు.కార్య నిర్వాహకులు దశాబ్ది ఉత్సవాల గుర్తుగా కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు.ఈ కార్యక్రమంలో పాల్గొని తమ ప్రతిభ కనబరిచిన చిన్నారులకు ఎమిరేట్స్ ఎన్.బి.డి బ్యాంకు వారు ఇచ్చిన బహుమతుల పంపిణి చేసారు అని కార్య నిర్వాహక సభ్యుడు అశోక్ గుంటక తెలియజేశారు.ఈ కార్యక్రమంలో కార్యనిర్వాహక సభ్యులు పావని శ్రీనివాస్, అర్చన వంశీ, పద్మజ గంగారెడ్డి ,లతా గోపాల్,దీప్తి శ్రీనివాస్, ప్రియ వెంకట్ రెడ్డి మరియు లక్ష్మిరెడ్డి పాల్గొన్నారు.





తాజా వార్తలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!







