మనసులో మాట చెప్పిన మలయాళ మెగాస్టార్

- June 02, 2024 , by Maagulf
మనసులో మాట చెప్పిన మలయాళ మెగాస్టార్

త్రివేండ్రం: ఇంత వరకు సాధించింది ఏంటి? రేపటి నుంచి ఏం సాధించాలి? ఇలాంటి లెక్కలన్నీ తనకు తెలియవని అంటున్నారు మలయాళం మెగాస్టార్‌ మమ్ముట్టి. తనకు తెలిసిందంతా ఇవాళ ఉన్న పనిని పూర్తి చేయడమే అని చెబుతున్నారు. ఇటీవల మమ్ముట్టి చెప్పిన కొన్ని మాటలు వైరల్‌ అవుతున్నాయి. ఇండస్ట్రీకి కొత్తగా వస్తున్న వారు తప్పక వినాలనే సలహాలూ వినిపిస్తున్నాయి. మలయాళ మెగాస్టార్‌ మమ్ముట్టికి ఫోర్‌ హండ్రెడ్‌ ప్లస్‌ సినిమాల ఎక్స్ పీరియన్స్ ఉంది.

ఇంత వరకు సాధించింది ఏంటి? రేపటి నుంచి ఏం సాధించాలి? ఇలాంటి లెక్కలన్నీ తనకు తెలియవని అంటున్నారు మలయాళం మెగాస్టార్‌ మమ్ముట్టి. తనకు తెలిసిందంతా ఇవాళ ఉన్న పనిని పూర్తి చేయడమే అని చెబుతున్నారు. ఇటీవల మమ్ముట్టి చెప్పిన కొన్ని మాటలు వైరల్‌ అవుతున్నాయి. ఇండస్ట్రీకి కొత్తగా వస్తున్న వారు తప్పక వినాలనే సలహాలూ వినిపిస్తున్నాయి.

మలయాళ మెగాస్టార్‌ మమ్ముట్టికి ఫోర్‌ హండ్రెడ్‌ ప్లస్‌ సినిమాల ఎక్స్ పీరియన్స్ ఉంది. ఆయన కెరీర్‌లో చేయని పాత్రలేదని అంటారు. కానీ నేను చేయాల్సింది ఇంకా చాలా ఉంది... ఎన్నెన్నో పాత్రలు నన్ను ఊరిస్తూనే ఉంటాయని వినమ్రంగా చెబుతుంటారు మమ్ముక్కా. రీసెంట్‌గా ఆయన నటించిన కాన్సెప్టులు చూసి విస్తుపోతోంది మలయాళ ఇండస్ట్రీ.

తనకు తెలిసింది యాక్టింగ్‌ మాత్రమే అని అంటారు మమ్ముట్టి. గడిచిన క్షణాల గురించి ఆలోచించే అలవాటు ఆయనకు అసలు లేదట. గతం గతః అనే పదాన్ని నూటికి నూరుపాళ్లు నమ్ముతారట. ఈ క్షణం ఏంటి? అనేది మాత్రమే ఆయన స్పృహలో ఉంటుందట.అంతకు మించి ఆలోచించడం కూడా వృథా అని అంటారు ఈ స్టార్‌.

స్టార్‌డమ్‌ చూసుకుని గొప్పలు పోవడం తనకు ఇష్టం లేదని అంటున్నారు మమ్ముట్టి. అంతే కాదు, మనిషి పోయిన పదీ, పదిహేను ఏళ్ల తర్వాత ఎవరికీ గుర్తుండరని అంటున్నారు. ఎంత గొప్ప గొప్ప నటులనైనా భావి తరాలు ఎన్నేళ్లు గుర్తుపెట్టుకుంటాయో చెప్పండి అని సున్నితంగా ప్రశ్నిస్తున్నారు ఈ స్టార్‌.

ఆల్రెడీ కొన్ని వేల మంది నటీనటులను చూశాం. వాళ్లను... ఎప్పుడో సందర్భం వచ్చినప్పుడు స్మరించుకోవడం తప్ప, అదేపనిగా అనుకోం కదా... మరి కొన్ని తరాలు దాటితే మనం కూడా ఎవరికీ గుర్తుండం కదా... అనేది మమ్ముకా నమ్మే సిద్ధాంతం . ఈ ఆలోచనా విధానమే తనను నడిపిస్తుందని అంటున్నారు మల్లు మెగాస్టార్‌.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com