ఏ పనులు చేస్తే ఎంతెంత క్యాలరీలు ఖర్చవుతాయంటే.!

- June 03, 2024 , by Maagulf
ఏ పనులు చేస్తే ఎంతెంత క్యాలరీలు ఖర్చవుతాయంటే.!

క్యాలరీలు ఖర్చు చేయకుంటే కొవ్వు కణాలు పెరిగిపోతుంటాయ్ తద్వారా బరువు సమస్యలతో పాటూ, అనేక రకాల అనారోగ్య సమస్యలు వెంటాడుతుంటాయ్.
అయితే, క్యాలరీలు బర్న్ చేయాలంటే ఏం చేయాలి.? ఏ ఏ పనులకు ఎంతెంత క్యాలరీలు ఖర్చవుతాయ్.? తెలుసుకుందాం.
ఒక గంట సేపు వాకింగ్ కానీ, జాగింగ్ కానీ చేయడం వల్ల దాదాపు 1000 క్యాలరీలు బర్న్ అవుతాయట. అలాగే, మహిళలు ఇంట్లో చేసుకునే పనిలోనే ఒక్కో పనికీ ఒక్కో విధంగా క్యాలరీలు బర్న్ అవుతాయ్.
మహిళలు బట్టలు ఉతికి, ఆరేయడం వల్ల 200 కేలరీల వరకూ ఖర్చవుతాయట. అలాగే, వంట చేయడం కోసం కూరగాయలు కట్ చేయడానికి 40 క్యాలరీలు, ఇల్లు ఊడ్చడం ద్వారా (ఇంటి పరిమాణాన్ని బట్టి) దాదాపు 100 నుంచి 150 వరకూ క్యాలరీలు ఖర్చయ్యే అవకాశముందట.
ఎవరికైనా సరే, ఒక ఫ్లోర్ మెట్లు ఎక్కి దిగడం వల్ల 100 క్యాలరీలు బర్న్ అవుతాయని నిపుణులు చెబుతున్నారు. వీటితో పాటూ, బలమైన వర్కవుట్లు, ఎక్స‌ర్‌సైజులు చేయడం వల్ల ఆయా వర్కవుట్స్‌ని బట్టి అన్ని క్యాలరీలు బర్న్ అవుతాయ్.
తీసుకున్న ఆహారానికి తగినంత లెక్కలో క్యాలరీలు ఖర్చు చేయకుంటే అనేక అనారోగ్యాల బారిన పడే అవకాశాలున్నాయ. తస్మాత్ జాగ్రత్త.! అని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com