రామ్ చరణ్ సరసన కృతి శెట్టి?
- June 03, 2024
అన్నీ కలిసొస్తే.. ఈ పాటికే బేబమ్మ, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సరసన ఛాన్స్ దక్కించుకుని వుండేది. అమ్మడి ఎంట్రీనే మెగా ఫ్యామిలీ నుంచి జరిగింది మరి.
అయితే, కెరీర్ మధ్యలోనే డ్రాప్ అయిపోవడంతో ఆ కల ఇంతవరకూ నెరవేరలేదు. అన్నట్లు ఇంతకీ రామ్ చరణ్ - కృతి శెట్టి కాంబినేషన్ ఎందుకు చర్చకొచ్చిందంటారా.?
వరుస ఫెయిల్యూర్స్ తర్వాత కృతి శెట్టి కొంత గ్యాప్ తీసుకుని చేసిన సినిమా ‘మనమే’. ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ ఈవెంట్‌కి రామ్ చరణ్ ముఖ్య అతిధిగా విచ్చేశారు.
ఈ ఈవెంట్లోనే తనకు రామ్ చరణ్ అంటే చాలా ఇష్టమని... అందరితోనూ బాగా కలిసిపోతారనీ, ఎవ్వరితోనైనా చాలా రెస్పెక్ట్‌గా వుంటారనీ, డెడికేటెడ్ అనీ.. ఇలా ఆయనపై తనకున్న అభిమానాన్ని వెల్లబుచ్చుకుంది అందాల బేబమ్మ కృతి శెట్టి.
ఈ ఎగ్జైట్మెంట్లోనే తనకు రామ్ చరణ్ సినిమాలో ఛాన్సొస్తే.. చాలా హ్యాపీ ఫీలవుతానని కూడా చెప్పేసింది. అన్ని కుదిరి క్రేజ్‌తో పాటూ, సక్సెస్ కూడా తోడై వుండి వుంటే.. ఇప్పుడు రామ్ చరణ్ నటిస్తున్న ఏదో ఒక ప్రాజెక్ట్‌లో ఖచ్చితంగా కృతి శెట్టి హీరోయిన్ అయ్యుండేది. ఏమో, చూడాలి మరి, ‘మనమే’ హిట్టయితే మళ్లీ కృతి శెట్టి కమ్ బ్యాక్ అవుతుంది.
అలా రామ్ చరణ్ ఫ్యూచర్ ప్రాజెక్టుల్లో ఛాన్స్ దక్కించుకుంటుందేమో చూడాలి మరి.
తాజా వార్తలు
- మెడికల్ సెంటర్ కు షాక్.. డాక్టర్‌కు BD4,072 చెల్లించాలని కోర్టు తీర్పు..!!
- ఒమన్ కుటుంబాల నెలవారీ ఆదాయం పెరుగుదల..!!
- దుబాయ్ లో 9 రోజుల స్కూల్ బ్రేక్.. అక్టోబర్ హాఫ్-టర్మ్ తేదీల్లో మార్పులు..!!
- వైరల్ గా మారిన H1N1 ఫ్లూ ! లైట్ తీసుకుంటే మీకే ప్రమాదం
- బహ్రెయిన్-భారత్ సంబంధాల బలోపేతంపై ప్రశంసలు..!!
- త్వరలో యూనిఫైడ్ గల్ఫ్ టూరిస్ట్ వీసా..!!
- దుబాయ్‌లో టండూర్ టీనా రెస్టారెంట్ శాశ్వతంగా మూసివేత..!!
- OUN యాప్‌లో మున్సిపాలిటీ మంత్రిత్వ శాఖ 38 కొత్త సేవలు..!!
- మస్కట్‌లో సమావేశమైన ఒమన్-బ్రిటన్ వర్కింగ్ గ్రూప్స్..!!
- జహ్రాలో అనుమతి లేని గ్రోసెరీ స్టోర్ గుట్టురట్టు..!!







