‘కల్కి’తో పోటీనా.! ‘ఇంద్రాణీ.’!
- June 03, 2024
భారీ విజువల్ ఎఫెక్ట్స్, ఓ రోబో వుంటే చాలా.! అది ప్రబాస్ సినిమాకి పోటీ అయిపోతుందా.? ‘కల్కి’ని అంత చిన్న చూపు చూస్తున్నారా.? ప్రబాస్ వంటి యూనివర్సల్ హీరో. అందుకు తగ్గట్లుగానే భారీ కాస్టింగ్.. భారీ బడ్జెట్.. ప్రముఖ పేరున్న బ్యానర్, ఓ బిగ్గెస్ట్ హిట్టు కొట్టిన డైరెక్టర్.. ఇవన్నీ ‘కల్కి’ క్వాలిటీస్.
అలాంటిది అసలెవ్వరికీ తెలియని ఓ హీరోయిన్.. ఆ సినిమాలో కొన్ని విజువల్స్ కల్కి సినిమాని తలపిస్తున్నాయని చెప్పి.. ఓ రోబో కూడా వుందని చెప్పి ఇంకేముంది కల్కితో పోటీకి దిగుతున్న ‘ఇంద్రాణీ’ అంటూ ప్రచారం చేసేస్తారా.?
‘ఇంద్రాణి’ సినిమా విషయంలో ప్రచారం ఇదే జరుగుతోంది. ఎంత పబ్లిసిటీలో భాగమైతే మాత్రం మరీ ఇంతలానా.! కొన్ని వందల కోట్లు వ్యత్యించి ‘కల్కి’ సినిమాని తెరకెక్కిస్తున్నారు.
అలాంటిది ఓ చిన్న స్కేల్ వున్న సినిమా (అలాగని చిన్న సినిమాల్ని కించపరచడం అన్నది మా వుద్యేశ్యం కాదు)ని ఎలా ఓ లార్జ్ స్కేల్ మూవీతో పోల్చి చెప్పేస్తారు.. అన్నదే పాయింట్ ఇక్కడ.
ఇంతకీ ‘ఇంద్రాణి’ సినిమా విషయానికి వస్తే. తాజాగా ఓ ట్రైలర్ వచ్చింది. ఇందులో హీరోయిన్ పేరు, అడ్రస్ సంగతి పక్కన పెడితే, చెప్పుకోదగ్గ నటులేమీ లేరిక్కడ. ఓ సూపర్ విమెన్ కథ. చిట్టి అనే రోబో కూడా వుంది. ఓకే.. వాళ్లకున్న సోర్సెస్ ప్రకారం విజువల్స్ కూడా బాగానే చిత్రీకరించారు. టైమ్ ట్రావెల్ నేపథ్యమున్న కథే. ఇండియాకీ రాణి ఇంద్రాణి.. అంటూ హీరోయిన్ డైలాగులు బాగానే చెబుతోంది. కానీ, ‘కల్కి’తో పోటీ అనేదే కరెక్ట్ కాదన్నది కొందరి అభిప్రాయం.
తాజా వార్తలు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!
- వరల్డ్ టాప్ 10 సురక్షితమైన దేశాలలో ఒమన్..!!
- కువైట్ లో "దిస్ ఈస్ యువర్ రోల్" ప్రారంభం..!!
- బహ్రెయిన్, ఇండియా మధ్య లీగల్, ట్యాక్స్ సహకారం..!!
- ఒమన్‌తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..