ఢిల్లీకి బయల్దేరిన చంద్రబాబు, పవన్
- June 05, 2024
టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్‌కల్యాణ్ వేర్వేరుగా ఢిల్లీకి బయల్దేరి వెళ్లారు. ఎన్డీయే భాగస్వామ్య పక్షాల భేటీలో వారిద్దరూ పాల్గననున్నారు. కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటుపై ఈ సమావేశంలో చర్చ జరగనుంది. తన ప్రమాణ స్వీకారానికి ప్రధాని సహా ఢిల్లీ పెద్దలను చంద్రబాబు ఆహ్వానించనున్నారు. ఢిల్లీ బయల్దేరే ముందు ఎన్డీయేలోనే ఉంటానని ఆయన స్పష్టం చేశారు.
మరోవైపు జనసేన అధినేత పవన్ కల్యాణ్ కుటుంబ సమేతంగా విమానంలో ఢిల్లీ బయల్దేరారు. ఎన్డీయే సమావేశంలో చంద్రబాబుతో కలిసి ఆయన పాల్గొననున్నారు. అంతకు ముందు జనసేన నుంచి గెలుపొందిన ఎంపీలు, ఎమ్మెల్యేలతో పార్టీ కార్యాలయంలో పవన్ సమావేశమయ్యారు. వారందరికీ అభినందనలు తెలిపారు. మరింత బాధ్యతతో కలిసి పని చేయాలని సూచించారు. ఓటేసిన ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండాలన్నారు.
తాజా వార్తలు
- రవీంద్ర భారతిలో ఎస్పీ బాలు విగ్రహావిష్కరణ..పాల్గొన్న ప్రముఖులు
- IPL మినీ ఆక్షన్లో కొత్త రూల్...
- జోర్డాన్ చేరుకున్న ప్రధాని మోదీ..
- కోఠి ఉమెన్స్ కాలేజీలో వేధింపులు..
- 2029 ఎన్నికల్లో ఖచ్చితంగా పోటీ చేస్తా: కవిత
- శ్రీమతి ఆంధ్రప్రదేశ్ 2025గా హేమలత రెడ్డి ఎంపిక…
- రవీంద్రభారతిలో ఎస్పీబాలు విగ్రహావిష్కరణ
- న్యూ ఇయర్ వేడుకలకు సీపీ సజ్జనార్ కీలక మార్గదర్శకాలు
- తామ్కీన్, SIO ఫ్రాడ్ కేసులో 10 ఏళ్ల జైలుశిక్షలు..!!
- సకాన్ హౌజింగ్ యూనిట్ల కేటాయింపు ప్రారంభం..!!







