రాజకీయాల్లోనూ ఆయన ‘పవర్’ స్టారే.!
- June 05, 2024
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ఇప్పుడు రాజకీయాల్లో కింగ్ మేకర్, గేమ్ చేంజర్ వంటి ప్రముఖ నామధేయులయ్యారు. కూటమి పేరు చెప్పి, ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలిపోకుండా చేసి ఆంధ్ర రాష్ట్ర ఎన్నికల గురించి ప్రపంచం మొత్తం చర్చించుకునేలా చేశారాయన.
ఎట్టకేలకు తాను అనుకున్నది సాధించారు. ఎన్నికల్లో ఎనలేని గెలుపు సాధించి వందకు వంద శాతం సీట్లు కొల్లగొట్టి అనూహ్యమైన విజయం సాధించారు. నిస్వార్ధంతో ప్రజలకు సేవ చేయాలన్న తన కలను నెరవేర్చుకున్నారు.
గత పదేళ్లుగా తాను పడుతున్న కష్టానికి తగ్గ ఫలితమిది. ప్రజల నమ్మకాన్ని గెలుచుకున్నారాయన. ఇంతవరకూ సినిమాల్లోనే ఆయన పవర్ స్టార్. ఇక నుంచి రాజకీయాల్లోనూ ఆయన పవర్ స్టార్గా చక్రం తిప్పనున్నారు.
ఇంతవరకూ యువతలో సినిమాలూ, క్రికెట్ అంటేనే ఆసక్తి ఎక్కువ. అలాంటిది భవిష్యత్లో ఎన్నికలు, రాజకీయాల గురించి కూడా యూత్ చర్చించుకునే దిశగా ఆయన తన రాజకీయాలతో యువతను ప్రభావితం చేశారు.
అందుకే 2024 ఎలక్షన్లు అంత స్పెషల్. అన్ని పనులూ, అన్ని ఎంటర్టైన్మెంట్స్ పక్కన పెట్టేసి ఎంతో ఉత్సాహంతో, ఉత్సుకతతో యువత టీవీల ముందు కూర్చుండిపోయారు. గెలుపు కోసం ఎదురు చూశారు. ఆ గెలుపు పండగలా సెలబ్రేట్ చేసుకున్నారు. దీనికంతటికీ కారణం పవన్ కళ్యాణ్. దటీజ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.
తాజా వార్తలు
- రవీంద్ర భారతిలో ఎస్పీ బాలు విగ్రహావిష్కరణ..పాల్గొన్న ప్రముఖులు
- IPL మినీ ఆక్షన్లో కొత్త రూల్...
- జోర్డాన్ చేరుకున్న ప్రధాని మోదీ..
- కోఠి ఉమెన్స్ కాలేజీలో వేధింపులు..
- 2029 ఎన్నికల్లో ఖచ్చితంగా పోటీ చేస్తా: కవిత
- శ్రీమతి ఆంధ్రప్రదేశ్ 2025గా హేమలత రెడ్డి ఎంపిక…
- రవీంద్రభారతిలో ఎస్పీబాలు విగ్రహావిష్కరణ
- న్యూ ఇయర్ వేడుకలకు సీపీ సజ్జనార్ కీలక మార్గదర్శకాలు
- తామ్కీన్, SIO ఫ్రాడ్ కేసులో 10 ఏళ్ల జైలుశిక్షలు..!!
- సకాన్ హౌజింగ్ యూనిట్ల కేటాయింపు ప్రారంభం..!!







