‘కల్కి’ టైమ్ బిగిన్స్.! అనుకున్న టైమ్ కన్నా ముందే.!
- June 05, 2024
విజువల్ వండర్‌గా ప్రచారమవుతోన్న ‘కల్కి 2898 ఏడీ’ సినిమా కోసం ప్రపంచం మొత్తం ఎదురు చూస్తోంది. ఈ నెల 27న వరల్డ్ వైడ్‌గా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ నేపథ్యంలో ఆల్రెడీ చిత్ర యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలు మొదలెట్టేసింది. అందులో భాగంగానే కొన్ని గ్లింప్స్ పోస్టర్లతో సహా ఈ సినిమాలో అత్యంత కీలక పాత్ర అయిన బుజ్జి అనే రోబో కార్ పరిచయం కూడా అయిపోయింది.
ఈ బుజ్జి కారు ప్రపంచం మొత్తం తిరిగేస్తూ తనదైన శైలిలో ‘కల్కి’ సినిమాని ప్రమోట్ చేసేస్తోంది. ఇక, అందరూ ఆశిస్తున్నట్లుగా ‘కల్కి’ ట్రైలర్ రిలీజ్‌కి సమయం ఆసన్నమైంది. నిజానికి ఇప్పట్లో ట్రైలర్ రిలీజ్ చేయాలనుకోలేదు. కానీ, అనుకున్న టైమ్ కన్నా ముందుగానే ట్రైలర్ రిలీజ్ కోసం ఏర్పాట్లు చేస్తున్నారు.
ఈ నెల 7న కల్కి ట్రైలర్ రిలీజ్ చేయాలనుకుంటున్నారట. ఈ కారణంగా సినిమాపై మరింత ఆసక్తి పెరిగే అవకాశాలున్నాయని చిత్ర యూనిట్ నమ్ముతోంది. ఇప్పటికే ఈ సినిమాలో కీలక పాత్రధారుల పోస్టర్లు పరిచయం చేశారు. వారికి సంబంధించిన చిన్న చిన్న వీడియో ప్రోమోలు కూడా వదిలారు. ఇక, ట్రైలర్‌లో ఎలాంటి అద్భుతాలు చూపించబోతున్నారో అని ఈగర్‌గా ఎదురు చూస్తున్నారు.
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







