బెల్లీ ఫ్యాట్‌ను తగ్గించుకోవడానికి తీసుకోవల్సిన ఆహారాలేంటో తెలుసా.?
- June 05, 2024
బెల్లీ ఫ్యాట్‌తో చాలా మంది బాధపడుతుంటారు. కొందరిలో బాడీ అంతా సమానమైన వెయిట్ వున్నప్పటికీ బెల్లీ ఫ్యాట్ మాత్రం చాలా ఎక్కువగా వుంటుంది. ఇలా పొట్ట చుట్టూ వున్న కొవ్వును తగ్గించుకోవడానికి కొన్ని రకాల ఆసనాలు, వర్కవుట్లు చేస్తుంటారు. కానీ, అవన్నీ చేయడం కష్టమనుకున్న వాళ్లు కొన్ని రకాల ఆహారాలను తమ డైట్‌లో చేర్చుకుంటే, బెల్లీ ఫ్యాట్ సమస్య చాలా ఈజీగా తగ్గించుకోవచ్చు. అవేంటో తెలుసుకుందాం.
దాల్చిన చెక్క:
దాల్చిన చెక్కలోని ఫైబర్ కంటెంట్ బెల్లీ ఫ్యాట్ తగ్గించడానికి చాలా యూజ్ అవుతుంది. అందుకోసం రాత్రి పూట ఓ గ్లాసు నీటిలో దాల్చిన చెక్క వేసి రాత్రంతా నానబెట్టి వుంచాలి. ఆ నీటిని వుదయాన్నే లేచి పరగడుపుతో తాగితే కొన్ని రోజులకు ఖచ్చితంగా ఫలితం వుంటుంది.
అవిసె గింజలు:
అవిసె గింజల్లోని ఫైబర్ చాలా ఎక్కువగా వుంటుంది. వీటిని తింటే చాలా సేపు పొట్ట బరువుగా వుంటుంది. అవిసె గింజలు నెమ్మదిగా జీర్ణమయ్యే శక్తిని కలిగి వుంటాయ్. అందుకే చాలా సేపు ఆకలి వేయదు. తద్వారా ఫ్యాట్ కంట్రోల్ అవుతుంది. అలాగని నీరసం కూడా అనిపించదు. అవిసె గింజల్లోని మోనో సాచురేటెడ్ అమైనో ఆమ్లాలు శరీరానికి కావల్సిన శక్తిని అందించి అనవసరమైన కొవ్వు కణాలు పెరగకుండా చేస్తాయ్.
డ్రై ప్రూట్స్:
డ్రై ఫ్రూట్స్‌కీ బెల్లీ ఫ్యాట్ కరిగించే శక్తి ఎక్కువే. అయితే, ఆచి తూచి తీసుకోవాలి. బాదం గింజల్ని రాత్రి పూట నానబెట్టి తొక్క తీసి తినడం వల్ల మంచి ఫలితం వుంటుంది.
మెంతులు:
మెంతుల్లోని ఓమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు బెల్లీ ఫ్యాట్ తగ్గిస్తాయ్. వీటిని కూడా రాత్రి పూట నానబెట్టి, ఆ నీటిని వడకట్టి తాగితే చాలా తక్కువ టైమ్‌లో ఎక్కువ లాభాలు కనిపిస్తాయ్. కేవలం కొవ్వు కరిగించడమే కాదు, ఆరోగ్యానికి అనేక రకాల మేలు చేస్తాయ్ మెంతులు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..