నేరాలకు చెక్.. RAKలో కొత్త వెహికల్ ట్రాకింగ్ సిస్టమ్‌

- June 05, 2024 , by Maagulf
నేరాలకు చెక్.. RAKలో కొత్త వెహికల్ ట్రాకింగ్ సిస్టమ్‌

యూఏఈ: ప్రధాన రహదారి భద్రతా ప్రాజెక్ట్ కింద రస్ అల్ ఖైమాలో కొన్ని వాహనాలను కొత్త వ్యవస్థ ట్రాక్ చేయనున్నారు. ఈ 'వెహికల్ ట్రాకింగ్ సిస్టమ్' ఎమిరేట్‌లో నేరాలను ఎదుర్కోవడానికి దోహదపడుతుందని రస్ అల్ ఖైమా పోలీస్ కమాండర్-ఇన్-చీఫ్ మేజర్-జనరల్ అలీ అబ్దుల్లా బిన్ అల్వాన్ అల్ నుయిమి అన్నారు.  భద్రతా రక్షణ అవసరమయ్యే వాహనాలపై ట్రాకర్ ఉపయోగించబడుతుందని, ఈ సేవ ఎలక్ట్రానిక్‌గా అందుబాటులో ఉంటుందని మేజర్ జనరల్ అల్ నుయిమి తెలిపారు. పబ్లిక్ రిసోర్సెస్ అథారిటీ సహకారంతో వాహనాలు మరియు డ్రైవర్ల లైసెన్సింగ్ విభాగం పర్యవేక్షణలో ఈ ప్రాజెక్ట్ ప్రారంభించినట్లు వెల్లడించారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com