ఈద్ అల్ అదా.. సెలవు 4 లేదా 5 రోజులా?
- June 05, 2024
యూఏఈ: ఇస్లామిక్ పండుగ ఈద్ అల్ అదా సందర్భంగా సెలవులను నిర్ణయించే మూన్ సైట్ ప్రక్రియ జూన్ 6న నిర్వహించనున్నారు. నివాసితులు వారాంతాన్ని బట్టి నాలుగు లేదా ఐదు రోజులు సెలవులను పొందుతారు. ఇస్లాంలో అత్యంత పవిత్రమైన రోజు - అరాఫా డే (ఒక రోజు సెలవు). ఈద్ అల్ అదా పండుగ (మూడు రోజులు సెలవు) గుర్తుగా సెలవు ఇవ్వనున్నారు. ఇస్లామిక్ పండుగలు హిజ్రీ క్యాలెండర్ నెలల ప్రకారం లెక్కిస్తారు. వీటి ప్రారంభం మరియు ముగింపు చంద్రవంక కనిపించే సమయాన్ని బట్టి నిర్ణయిస్తారు.
అరబ్ ప్రపంచంలోని చాలా దేశాలు యూఏఈతో సహా హిజ్రీ క్యాలెండర్ నెల 29వ తేదీన ధుల్ ఖఅదాహ్ 29వ తేదీన నెలవంక దర్శనం కోసం చూస్తారు. అది జూన్ 6న ఉంటుంది. ఒకవేళ కనిపించినట్లయితే, ఆ తర్వాత నెల - దుల్ హిజ్జా - మరుసటి రోజు ప్రారంభమవుతుంది ( జూన్ 7). కాకపోతే, నెల జూన్ 8 నుండి ప్రారంభమవుతుంది.
జూన్ 6న చంద్రుడు కనిపిస్తే: జూన్ 7న ధుల్ హిజ్జా ప్రారంభమవుతుంది. అరఫా దినం జూన్ 15న (దుల్ హిజ్జా 9) మరియు ఈద్ అల్ అదా జూన్ 16న (దుల్ హిజ్జా 10) ఉంటుంది. అప్పుడు సెలవులు జూన్ 15(శనివారం) నుండి జూన్ 18 (మంగళవారం) వరకు ఉంటుంది.
జూన్ 6న చంద్రుడు కనిపించకపోతే: జూన్ 8న దుల్ హిజ్జా ప్రారంభమవుతుంది. అరఫా దినం జూన్ 16న (దుల్ హిజ్జా 9) ఉంటుంది. ఈద్ అల్ అదా జూన్ 17 (దుల్ హిజ్జా 10) న. కాబట్టి సెలవులు జూన్ 16( ఆదివారం) నుండి జూన్ 19(బుధవారం) వరకు ఉంటుంది.
తాజా వార్తలు
- యూట్యూబ్ చూసి ఫేక్ కరెన్సీ తయారీ..
- ఇరాన్ కీలక నిర్ణయం.. హర్మూజ్‌లో భారత్ నౌకలకు మినహాయింపు
- ప్రపంచ రికార్డు సాధించిన విరాట్ కోహ్లి
- సౌదీలో మోస్తరు నుంచి భారీ వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరిక..!!
- అమెరికా–ఇరాన్ సంక్షోభానికి త్వరలో ముగింపు.. ప్రయత్నాలు ముమ్మరం..!!
- అగ్నివీర్లకు గుడ్‌న్యూస్.. సేవా కాలం మరో రెండేళ్లు పొడిగింపు!
- కువైట్‌లో రోడ్డు ప్రమాదం.. 11 మంది భారతీయ నర్సులకు గాయాలు..!!
- ఒమన్‌లో ఉద్యోగ, శిక్షణ లక్ష్యాల్లో 89 శాతం పూర్తి..!!
- గుడ్ న్యూస్ చెప్పిన టీజీఎస్ ఆర్టీసీ
- బహ్రెయిన్‌లో విద్యుత్, నీటి వినియోగదారులకు గుడ్ న్యూస్..!!







