రమదాన్‌లో డయాబెటిక్ పేషెంట్ల ఉపవాసమెలా?
- June 11, 2016
ఖతార్ డయాబెటిస్ అసోసియేషన్, 15 ఏళ్ళుగా రమదాన్ సందర్భంగా డయాబెటిక్ పేషెంట్లు ఉపవాస దీక్షలు చేయడంపై అవగాహనా కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తోంది. పవిత్ర రమదాన్ మాసంలో ఉపవాసాన్ని ఎంతో బాధ్యతగా నిర్వహిస్తారు ముస్లింలు. అయితే డయాబెటిక్ సమస్యలతో వారి ఆరోగ్యానికి ఇబ్బందికర పరిస్థితులు ఉపవాసంతో తలెత్తుతాయి. అలాంటి ఇబ్బందులు రాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు ఊచిస్తున్నారు. దీనికి సంబంధించి అవగాహనా కార్యక్రమాలు నిర్వహించేందుకు మూడు వర్క్‌షాపులను ఏర్పాటు చేసింది. మహిళా, పురుష పేషెంట్లకు అలాగే జనరల్ ప్రాక్టీషనర్లకు ఈ వర్క్‌షాప్‌లో అవగాఖన కల్పిస్తారు. పేషెంట్లను వివిధ కేటగిరీల కింద విభజించి, ఎవరైతే ఉపవాసం చెయ్యకూడదో అలాంటివారికి ప్రత్యేకంగా కౌన్సిలింగ్ ఇవ్వవలసి ఉంటుంది. హై రిస్క్, లో రిస్క్ మరియు మిడిల్ రిస్క్ కేటగిరీల కింద వీరిని విభజించాలి. హెచ్‌ఎంసి మరియు ప్రైమరీ హెల్త్ కేర్, క్యుడిఎ సంయుక్తంగా హాట్‌లైన్ నెంబర్లను ఏర్పాటు చేసి, పేషెంట్లకు అందుబాటులోకి తెచ్చారు. 30 మంది డాక్టర్లు ఫోన్ ద్వారా పేషెంట్లకు తగిన సమాచారం ఇస్తారు. తగిన వ్యాయామం చేస్తూ, తగినంత విశ్రాంతి తీసుకుని, చెడు అలవాట్లను దరిచేరనీయకుండా ఉంటే రంజాన్ ఉపవాసాల్ని లో రిస్క్ డయాబెటిక్ పేషెంట్లు చెయ్యవచ్చనీ, హైరిస్క్ పేషెంట్లు మాత్రం తగిన జాగ్గ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచించారు.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్‌లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్‌కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







