నవదీప్.. మరో ‘అర్జున్ రెడ్డి’ కానున్నాడా.?
- June 06, 2024
యంగ్ హీరో నవదీప్‌కి సరైన హిట్టు పడడం లేదు. మంచి విషయమున్న హీరోనే అయినప్పటికీ హీరో స్టేజ్ నుంచి క్యారెక్టర్ ఆర్టిస్టుగా సెటిలైన పరిస్థితులు. ఇలాంటి టైమ్‌లో నవదీప్ హీరోగా ఓ అరుదైన మూవీ తెరకెక్కింది అదే ‘లవ్ మౌళి’.
కొత్త దర్శకుడు అనీంద్ర ఈ సినిమాని తెరకెక్కించాడు. ప్రచార చిత్రాలు చాలా బోల్డ్‌గా వున్నాయ్. యూత్ ప్రధానాంశంగా రూపొందిన సినిమాలా ప్రొజెక్ట్ అవుతోంది.
సినిమా నిండా బోల్డ్ కంటెంట్, లిప్ లాక్స్.. ఇలాంటివి పుష్కలంగా వుందంటూ డైరెక్టర్ బోల్డ్‌గానే చెప్పేస్తున్నాడు. అలాగని అడల్డ్ మూవీ లిస్టులోకి ఈ సినిమా వెళ్లదని నమ్మకం వ్యక్తం చేస్తున్నాడు.
కథకి అవన్నీ ఖచ్చితంగా అవసరమయ్యాయ్ కాబట్టే పెట్టామని అంటున్నాడు. ఇన్నర్ వేర్స్‌లో మందు పోసుకుని తాగే క్యారెక్టర్ హీరోది. అలాగే పొడుగాటి జుట్టు, కండలు తిరిగిన శరీరం చాలా అంటే చాలా రగ్గ్డ్ లుక్స్‌లో కనిపిస్తున్నాడు నవదీప్ ఈ సినిమాలో.
అయితే, సినిమా అందరికీ బాగా నచ్చుతుందని ఓ మంచి మెసేజ్‌ని ఈ సినిమా ద్వారా ఇవ్వాలనుకున్నాననీ డైరెక్టర్ చెబుతున్నాడు. అంతేకాదు, ఆల్రెడీ కొన్ని స్పెషల్ ప్రీమియర్ షోల ద్వారా అందిన టాక్ ప్రకారం నిజంగానే సినిమా బాగుందని అంటున్నారు. చూడాలి మరి, ‘అర్జున్ రెడ్డి’ టైప్‌లో ‘లవ్ మౌళి’ హిట్ కొడుతుందేమో. అలాగైతే నవదీప్‌కి ఇన్నాళ్లకి బ్రేక్ వచ్చినట్లే.!
తాజా వార్తలు
- సౌదీ ఎయిర్‌పోర్ట్స్‌లో ఇక పై పక్కా నిఘా
- చెన్నైలో పల్స్ పోలియోను ప్రారంభించిన సీఎం విజయ్!
- తెలంగాణలో నేడు ఈ జిల్లాల్లో వానల హెచ్చరిక..
- మరోసారి తన గొప్ప మనసు చాటుకున్న సోనూ సూద్..
- TTDకి అనంత్ అంబానీ 25 ఎలక్ట్రిక్ బస్సుల విరాళం
- యూఏఈ లాటరీ 'లక్కీ డే' డ్రా..ఒక్కరికే Dh100,000 సొంతం..!!
- సోషల్ మీడియాలో వైరల్ వీడియోపై ఖతార్ ఎయిర్వేస్ క్లారిటీ..!!
- లూలూలో భారీ టెక్ డీల్స్..‘లెట్స్ కనెక్ట్’ టెక్ ఫెస్టివల్ ప్రారంభం..!!
- ICRF సమ్మర్ అవేర్నెస్..200 మంది కార్మికులకు ప్రయోజనం..!!
- విషాదం..సైనికుడి మృతికి యూఏఈ సంతాపం..!!







