పాయల్ రాజ్‌పుత్‌ని తక్కువంచనా వేయడానికి లేదండోయ్.!
- June 06, 2024
‘ఆర్ ఎక్స్ 100’ సినిమాలో ఆమె నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయ్. స్టన్నింగ్ రోల్‌లో నటించి వావ్ అనిపించుకుంది ఆ సినిమాతో పాయల్ రాజ్ పుత్. అంతేకాదు, సెన్సేషన్ డెబ్యూని తన ఖాతాలో వేసుకున్న ముద్దుగుమ్మ కూడా పాయల్.
అయితే, ఆ తర్వాత చెప్పుకోదగ్గ అవకాశాలు రాకపోవడం, అడపా దడపా వచ్చిన కొన్ని స్టార్ ఛాన్సులు సైతం ఆమె కెరీర్‌కి ఏమాత్రం యూజ్ కాకపోవడంతో పాయల్ రేస్‌లో వెనకే వుండిపోయింది.
పాయల్ నుంచి చివరిగా వచ్చిన ‘మంగళవారం’ సినిమా జనాల నోళ్లలో మెదిలింది. కోరికలు ఆపుకోలేకపోవడం అనే ఓ రకమైన మానసిక వ్యాధితో బాధపడే యువతిగా ఆ సినిమాలో పాయల్ పాత్రకు ప్రశంసలు దక్కాయ్. తెగ పొగడ్తలు గుప్పించారు ఈ సినిమాపై.
ఓటీటీలోనూ బాగానే సందడి చేసింది ఈ ‘మంగళవారం’ సినిమా. ఇలాంటి ఓ సక్సెస్ తర్వాత పాయల్ రాజ్‌పుత్ నుంచి తాజాగా ఇంకో సినిమా రాబోతోంది. అదే ‘రక్షణ’. ఈ సినిమాలో పాయల్ రాజ్‌పుత్ ఓ పవర్ ఫుల్ పోలీసాఫీసర్ పాత్రలో నటిస్తోంది. క్రైమ్ థ్రిల్లర్ బ్యాక్ గ్రౌండ్ వున్న సినిమాలకు బాగా క్రేజ్ వున్న నేపథ్యంలో ఈ సినిమా టాక్ కొంచెం బాగున్నా.. పాయల్‌కి పండగే.!
తాజా వార్తలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి
- నేపాల్ బాధితులను ఆదుకోవాలని సోనూ సూద్ పిలుపు!
- గోల్కొండలో ఘనంగా సోల్జరథాన్
- ప్రవాస తెలుగు బాలబాలికలకు ఆన్లైన్ ప్రతిభా వేదిక
- UAEలో Starlink vs du, e&: ఖర్చు, వేగం, ప్యాకేజీల్లో తేడాలివే
- UAEలో అన్ని పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాఠ్యాంశం
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- కాంగోలో విజృంభిస్తున్న ఎబోలా.. 3 వేల దాటిన మరణాలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా







