‘కల్కి’.! మళ్లీ మాట తప్పారుగా.!

- June 06, 2024 , by Maagulf
‘కల్కి’.! మళ్లీ  మాట తప్పారుగా.!

ఇంకేముంది అనుకున్న టైమ్ కన్నా ముందుగానే ’కల్కి‘ ట్రైలర్ రిలీజ్ చేస్తామని అధికారికంగా అనౌన్స్‌మెంట్ చేశారు. దాంతో ప్రబాస్ ఫ్యాన్స్‌లో ఉత్సాహం రెట్టింపయ్యింది. అయితే, ఆ అనౌన్స్‌మెంట్  నిజం కాలేదు.

జూన్ 7 వ తీదీన రిలీజ్ చేస్తామన్న ‘కల్కి’ ట్రైలర్ జూన్ 10 వ తేదీకి పోస్ట్ పోన్ అయ్యింది. 27న సినిమా రిలీజ్ వున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే రిలీజ్ విషయంలోనే ఎన్నో వాయిదాలు జరిగాయ్. ఇప్పుడు ట్రైలర్ విషయంలోనూ ఇలా.!

అంతేకాదు, ప్రబాస్ సినిమాలన్నింటి విషయంలోనూ ఇలాంటివే జరుగుతుంటాయ్. కానీ, ‘కల్కి’ చాలా ప్రెస్టీజియస్ మూవీ. అలాగే భారీ బడ్జెట్‌తో అనేక భాషల్లో ప్యాన్ వరల్డ్ మూవీగా రూపొందుతోంది. అలాంటిది ఈ సినిమా విషయంలోనూ ప్రతీదీ చాలా జాగ్రత్తగా చూసుకోవాలి.

ఇకపై వాయిదాల పర్వం నడిస్తే.. అస్సలు బాగోదు అని సోషల్ మీడియాలో కొందరు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. బాలీవుడ్ దిగ్గజ నటులైన అమితాబ్ బచ్చన్, విశ్వ నటుడు కమల్ హాసన్ ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. బాలీవుడ్ స్టార్ హీరోయిన్లు దీపికా పదుకొనె, దిశా పటానీ హీరోయిన్లుగా నటిస్తున్నారు.

నాగ అశ్విన్ దర్శకత్వంలో వైజయంతీ మూవీస్ బ్యానర్‌లో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాని రూపొందించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com