అకీరానందన్.! పవన్ వారసుడు ట్రెండింగ్ అయిపోయాడు.
- June 06, 2024
పవన్ కళ్యాణ్ వారసుడొచ్చాడు. ఓ వైపు విజయోత్సాహం మరో వైపు పుత్రోత్సాహం.. పవన్ కళ్యాణ్‌కి. ఎన్నికల్లో తిరుగు లేని విజయం సాధించిన పవన్ కళ్యాణ్ ఆ విజయ గర్వాన్ని తన కుటుంబంతో కలిసి ముఖ్యంగా వారసుడు అకీరానందన్‌తో కలిసి పంచుకుంటున్నాడు. కౌంటింగ్ అయిన తర్వాత విజయం అనౌన్స్మెంట్ కాగానే, సవతి తల్లి అన్నా లెజినోవాతో కలిసి బయటికి వచ్చి పవన్ కళ్యాణ్ నివాసం వద్ద జనాలకు అభివాదం చేశాడు అకీరానందన్.
ఆ రోజు నుంచీ పవన్ కళ్యాణ్ వెంటే వుంటూ వస్తున్నాడు. ప్రతీ ఫోటోలోనూ వీడియోలోనూ పవన్ పక్కన అకీరానందన్ ట్రెండింగ్ అవుతున్నాడు. ఆఖరికి ఢిల్లీకి సైతం వారసుడితో కలిసి పయనమయ్యాడు పవన్ కళ్యాణుడు.
ఇలా ప్రతీ దాంట్లోనూ అకీరానందన్ని ముందుంచుతున్న పవన్ వుద్యేశ్యమేంటీ.? అంటూ కొందరిలో అనేక రకాల అనుమానాలున్నాయ్. అయితే, తన వారసుడ్ని ప్రపంచానికి పరిచయం చేసే టైమొచ్చింది.. అని పవన్ కళ్యాణ్ ఈ విధంగా సూచనలిస్తున్నాడన్న మాట అనుకోవచ్చు.
అయితే, పవన్ కళ్యాణ్ మాదిరి అకీరానందన్ కూడా హీరో అవుతాడా.? అంటే ఆల్రెడీ ఆ పనుల్లో బిజీగానే వున్నాడు అకీరానందన్. అమెరికాలోని ఓ ప్రత్యేకమైన ఇన్స్టిట్యూషన్లో నటనకు శిక్షణ తీసుకుంటున్నాడు. అలాగే, తండ్రిలాగే మార్షన్ ఆర్ట్స్‌లోనూ మనోడు ప్రావీణ్యం దక్కించుకున్నాడు. అంతేకాదు, మ్యూజిక్, ఎడిటింగ్.. గట్రా టెక్నికల్ వర్క్ మీదా అకీరానందన్కి మంచి పట్టుంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో అకీరానందన్పై హాట్ హాట్ చర్చలు నడుస్తున్నాయ్.
తాజా వార్తలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి
- నేపాల్ బాధితులను ఆదుకోవాలని సోనూ సూద్ పిలుపు!
- గోల్కొండలో ఘనంగా సోల్జరథాన్
- ప్రవాస తెలుగు బాలబాలికలకు ఆన్లైన్ ప్రతిభా వేదిక
- UAEలో Starlink vs du, e&: ఖర్చు, వేగం, ప్యాకేజీల్లో తేడాలివే
- UAEలో అన్ని పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాఠ్యాంశం
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- కాంగోలో విజృంభిస్తున్న ఎబోలా.. 3 వేల దాటిన మరణాలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా







